రాష్ట్రీయం

కారు మహాజోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెజారిటీ: 4,59,000
జాతీయ పార్టీల డిపాజిట్లు గల్లంతు
రెండోస్థానంలో కాంగ్రెస్
మూడోస్థానంలో బిజెపి
ఉనికేలేని వామపక్షాలు
వరంగల్ ఉప ఎన్నికలో అధికార తెరాస ఓట్ల పెనుతుపాను సృష్టించింది. అందరి అంచనాలు తలకిందులు చేసి తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్ నాలుగున్నర లక్షల అఖండ మెజార్టీ సాధించారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. తొలి రౌండు నుంచి తుది రౌండ్ వరకూ కారు జోరు అప్రతిహతంగా సాగింది. (చిత్రం) వరంగల్‌లో నిర్వహించిన విజయోత్సాహ ర్యాలీలో విజయ సంకేతాన్ని చూపిస్తున్న తెరాస అభ్యర్థి మసునూరి దయాకర్
=======================
పాలనపై ప్రజాతీర్పు
పిచ్చికూతల విపక్షాలకు శృంగభంగం
కృత్రిమ వ్యతిరేకత సృష్టించుకున్నారు
అద్వితీయ ఫలితాలతో మా బాధ్యత పెరిగింది
వరంగల్ విజయంపై సిఎం కెసిఆర్ వ్యాఖ్య
హైదరాబాద్, నవంబర్ 24: తెరాస ప్రభుత్వ పాలనకు ప్రజలిచ్చిన తీర్పే వరంగల్ విజయమని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా వరంగల్ ఉప ఎన్నికల్లో తెరాసకు మెజారిటీ లభించిందన్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి దయాకర్ 4.59లక్షల మెజారిటీతో ఘన విజయం సాధించిన తరువాత కెసిఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఇది వంద శాతం పాజిటవ్ ఓటన్నారు. ప్రభుత్వ పక్షాన, తెరాస పక్షాన, వ్యక్తిగతంగా ప్రజలకు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతున్నట్టు ప్రకటించారు. ప్రజలిచ్చిన విజయంతో ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. విపక్షాల అసహన వైఖరి మంచిదికాదని, ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని హితవు పలికారు. తెరాసకు గెలుపోటములు కొత్తకాదు. ఈ విజయంతో పార్టీలో ఎవరూ అహంకారానికి పోవాల్సిన పనిలేదన్నారు. విపక్షాల అసహనాన్ని ప్రశ్నిస్తూ, సిఎం పదవి చేపట్టిన ఐదు రోజులకే రుణమాఫీపై అనని మాటకు కాంగ్రెస్ దిష్టిబొమ్మలు దగ్దం చేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన ఐదు రోజులకే దిష్టిబొమ్మలు దగ్దం చేయడం ఎక్కడా జరగలేదని, ఇంత అసహనమెందుకని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ అసహ్యకరమైన వైఖరి, ఓర్వలేనితనం మంచిది కాదన్నారు. వరంగల్ ఎన్నికల్లోనూ అదే పొకడ పోయారని, ప్రజలు మాత్రం అఖండ తీర్పుతో శృంగభంగం కలిగించారన్నారు. ఒక మీడియాను నమ్ముకని ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న కృత్రిమ వ్యతిరేకత సృష్టించుకుని వారే ఘోరంగా దెబ్బతిన్నారని విపక్షాలకు చురకలంటించారు.
అన్నింటికీ అడ్డంకులే
ప్రభుత్వం ఏపని చేయాలని ప్రయత్నించినా అడ్డంకులు కల్పిస్తున్నారని, ముసుగువీరులతో కోర్టులో కేసులు వేయిస్తున్నారని విమర్శించారు. విదేశీయులు మన సచివాలయానికి వస్తే శిథిలావస్థకు చేరుకున్న భవనాలను చూడటం బాగోదని కొత్త భవనం నిర్మించాలని ప్రయత్నిస్తే, దానిని అడ్డుకున్నారని విమర్శించారు. చివరకు హుస్సేన్‌సాగర్‌ను ప్రక్షాళన చేయాలని ప్రయత్నించినా కేసులు వేయిస్తున్నారన్నారు. ఉస్మానియా ఆస్పత్రిని తరలించాలని ప్రయత్నించినా, టిబి ఆస్పత్రిని తరలించాలని ప్రయత్నించినా అడ్డుంకులేనని అన్నారు. రవీంద్రభారతిని కొత్తగా నిర్మించాలని ప్రయత్నించినా, ఎన్టీఆర్ స్టేడియంలో సాంస్కృతిక కేంద్రాలు నిర్మించాలని ప్రయత్నించినా అడ్డంకులు కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్ర సిఎంలు ఉన్నప్పుడు వివాదంతో నిలిచిపోయే విధంగా ప్రాజెక్టులు డిజైన్ చేశారని, వాటిని మార్చేందుకు ప్రయత్నిస్తే ఇంతకాలం పాలించిన మాకు చాతకాలేదు, మేమేం చేయలేదు కాబట్టి మీరు కూడా ఏమీ చేయడానికి వీల్లేదని అడ్డుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వరంగల్ ఫలితాలను చూసైనా విపక్షాలు ఆలోచించాలని, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. పదివేలకోట్లతో వాటర్ గ్రిడ్‌తో ఇంటింటికి నీళ్లివ్వొచ్చని చెబుతున్న నేతలు, అధికారంలో ఉన్నప్పుడు ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇకనైనా సొల్లు పురాణం ఆపి ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా నిర్మాణాత్మక ధోరణి ప్రదర్శించాలని సూచించారు. వరంగల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపిలు డిపాజిట్ కోల్పోయాయని, గత ఎన్నికలకన్నా ఓట్లు తగ్గాయన్నారు. ఉప ఎన్నికల్లో అధికారపక్షం విజయం సహజమేనని చెబుతున్న వారు, మధ్యప్రదేశ్‌లో బిజెపి అభ్యర్థి ఓటమి, బిహార్, ఢిల్లీలో బిజెపి ఓటమికి ఏం సమాధానమిస్తారని కెసిఆర్ ప్రశ్నించారు.