జాతీయ వార్తలు

కరోనా కట్టడికి అమెరికా కట్టుదిట్టమైన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అమెరికాలో రోజురోజుకి విజృంభిస్తున్న కరోనాను అరికట్టేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఆయన కరోనాపై మాట్లాడుతూ రానున్న రోజుల్లో అమెరికా ఆర్థిక మాంద్యం పరిస్థితులను ఎదుర్కోవచ్చని అన్నారు. కాని ఈ పరిస్థితులను అధిగమిస్తామని ధీమా వ్యక్తంచేశారు. విమానయాన సర్వీసులను నిలిపివేయటంతో ఆ రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ రంగాన్ని ఆదుకుంటామని ట్రంప్ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు అమెరికాలో 4500 మంది వైరస్ బారిన పడగా..వీరిలో 88మంది మృత్యువాత పడ్డారు. అంతేకాదు పదిమంది కంటే ఎక్కువ హాజరయ్యే సమావేశాలను రద్దు చేసుకోవాలని సూచించారు. దేశంలో కర్ఫ్యూ విధించే పరిస్థితి లేదని అన్నారు. కాగా కరోనా వైరస్‌ను అదుపులోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని, ఆగస్టులో అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు.