జాతీయ వార్తలు

వైట్ హౌస్‌లో తొలి కరోనా కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ :అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో తొలి కరోనా కేసు నమోదైంది. ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ బృందంలోని ఓ వ్యక్తికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలింది. అయితే, అతడు అధ్యక్షుడు ట్రంప్‌తో కానీ, ఉపాధ్యక్షుడితో కానీ నేరుగా కలవలేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, అమెరికాలో కరోనాఈ మహమ్మారి బారినపడి 230 మంది ప్రాణాలు కోల్పోయారు. వాషింగ్టన్‌లో అత్యధికంగా 74 మంది మృతి చెందారు. గత రెండు రోజుల్లో ఏకంగా పదివేల కొత్త కేసులు అమెరికాలో నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 18వేలు దాటిపోయింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అత్యవసర స్థితి ప్రకటించి ఆర్మీని రంగంలోకి దింపింది.