తెలంగాణ

బ్యాంకు వద్ద రూ.5 లక్షలు కాజేసిన ఆగంతకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: బైక్‌పై రివ్వున వచ్చి 5 లక్షల రూపాయల నగదు ఉన్న బ్యాగును లిప్తకాలంలో ఓ ఆగంతకుడు అపహరించుకుపోయాడు. సదాశివపేటలోని ఆంధ్రాబ్యాంకు వద్ద ఈ సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. మునిపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన పాపయ్య ఆంధ్రాబ్యాంకు శాఖ నుంచి 5 లక్షల రూపాయలు విత్ డ్రా చేశాడు. ఆ నగదును బ్యాగులో పెట్టుకుని బ్యాంకు బయటకు పాపయ్య రాగానే బైక్‌పై వచ్చిన ఆగంతకుడు క్షణంలో తన పని పూర్తి చేసుకుపోయాడు. కాసేపటికి తేరుకున్న పాపయ్య లబోదిబో మంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.