తెలంగాణ

బ్యాంకులోనే మహిళా సభ్యులను బురిడీ కొట్టించిన మాయగాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ. 47వేల నగదు అపహరణ

బిచ్కుంద, డిసెంబర్ 28: బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసిన ఐకెపి మహిళా సంఘం సభ్యులను ఇద్దరు మాయగాళ్లు ఎంతో సునాయాసంగా బురిడీ కొట్టించి 47వేల రూపాయల నగదును అపహరించుకుపోయారు. సోమవారం చోటుచేసుకున్న ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఎస్‌బిహెచ్ బ్యాంకు ఆవరణ లోపలే జరిగింది. పోలీసులు, బాధిత మహిళల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలోని వినూత్న మహిళా సంఘం సభ్యులు డబ్బులు డ్రా చేసుకునేందుకు సోమవారం ఎస్‌బిహెచ్ బ్యాంకుకు వచ్చి ఐదు లక్షల రూపాయలను డ్రా చేసుకుని బ్యాంకు ఆవరణలోనే నగదును లెక్కించడం ప్రారంభించారు. ఇదే అదనుగా భావించిన ఇద్దరు యువకులు వారి వద్దకు చేరుకుని మహిళలను మాటల్లోకి దించారు. వారి మాట లు విశ్వసించిన సదరు మహిళలు నగదును లెక్కించి, అందులో ఏవైనా దొంగనోట్లు ఉన్నాయేమో చూడాలంటూ సదరు యువకుల చేతికి వే యి రూపాయల కరెన్సీ గల నోట్ల కట్ట ను అందించారు. సదరు మాయగాళ్లు మహిళల సమక్షంలో నోట్లను లెక్కిస్తున్నట్టు నటించి, అందులో నుండి 47నోట్లను (47వేలు) ఎంతో లాఘవంగా పక్కకు తప్పించి తమ జేబులో వేసుకుని ఆఘమేఘాల మీద బ్యాంకు బయటకు పరుగులు తీశారు. యువకులు వెళ్లిన తరువాత మరోమారు ఎంతో తాపీగా నగదును లెక్కించిన మహిళలకు వేయి రూపాయల నోట్ల కట్టలో 47నోట్లు తక్కువగా వస్తుండడంతో బ్యాంకు అధికారులను సంప్రదించారు. దీంతో సదరు మహిళలను యువకులు బురిడీ కొట్టించి నగదుతో పారిపోయినట్టు గుర్తించిన బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.