కరీంనగర్

కులం పేరుతో దూషించినందుకు మూడేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 20: వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేకుండా రౌడీగిరి, దాదాగిరీ చెలాయించి చంపేస్తానని, కులం పేరుతో దూషించిన గంగాధర ఎంపిటిసి పెరక మల్లారెడ్డికి (46) కరీంనగర్ ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి వాసుదేవరావు మూడు సంవత్సరాల జైలుశిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెళ్లడించారు. కోర్టు మానిటరింగ్ సెక్షన్ కథనం ప్రకారం..గంగాధర మండల కేంద్రానికి చెందిన న్యాయవాది తాళ్ల అంజయ్యకు, వారి కులస్థులకు మధ్య సొంత పట్ట్భామి సర్వే నం.951కి సంబంధించి భూ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో విచారణ జరిపేందుకు మండల తహశీల్దార్ అక్టోబర్ 9, 2012న మోకాపై వెళ్లారు. అదే సమయంలో గంగాధర ఎక్స్‌రోడ్ ప్రాంతానికి చెందిన ఎంపిటిసి పెరక మల్లారెడ్డికి ఈ వివాదం గురించి ఎలాంటి సంబంధం లేకుండా అక్కడికి చేరుకొని దాదాగిరి, రౌడీగిరి, రాజకీయ బలంతో ఒక న్యాయవాది అని చూడకుండా కులం పేరుతో దూషించి చంపేస్తానని బెదిరించాడు. దీనిపై పలుమార్లు అనేక ప్రాంతాల్లో బెదిరింపులకు గురి చేశాడు. జరిగిన సంఘటన పట్ల గంగాధర పోలీస్ స్టేషన్‌లో తాళ్ల అంజయ్య ఫిర్యాదు చేయగా, ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అప్పటి డిఎస్పీ లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపి కోర్టులో హాజరుపర్చారు. లీగల్ సెల్ ఎఎస్‌ఐ రషీద్ కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీందర్ రెడ్డి వాదించారు. కేసుపై పూర్వాపరాలను పరిశీలించిన న్యాయస్థానం న్యాయమూర్తి వాసుదేవరావు మూడు సంవత్సరాల జైలుశిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెళ్లడించారు.

కెటిఆర్ హామీల అమలుకు డిమాండ్
* జగిత్యాల సబ్ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి
* గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల ధర్నా
జగిత్యాల, నవంబర్ 20: మంత్రి కెటిఆర్ సమ్మె చేపట్టిన సందర్భంగా చర్చల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని శుక్రవారం గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికులు జగిత్యాల సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎరవెల్లి ముత్యంరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మారంపెల్లి శ్రీనివాస్, కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ సమ్మె విరమించి 3నెలలు కావస్తున్నా సమ్మె కాలంలో సిఎం తనయుడు మంత్రి కెటిఆర్ చర్చలు జరిపి ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతన చెల్లింపు పరిమితి 50శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేస్తామనే మాట నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని, వేతన చెల్లింపునకు అడ్డంగా ఉన్న నిబంధన తొలగించాలని, పిఎఫ్, ఇసిఎస్‌ఐ తదితర చట్టబద్ధత కోసం, అర్హులైన అందరిని ఫర్మినెంట్ చేస్తూ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా 30వేల మంది గ్రామ పంచాయతీ కార్మికులం ఆందోళన కార్యక్రమాలు మొదలు పెట్టామన్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు వివిధ రూపాల్లో గ్రామ పంచాయతీ కార్మికులు, ఉద్యోగుల ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించారు. 30శాతం నిబంధనలు 50శాతానికి పెంచడం జరుగుతుందని మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చి అమలు చేయడం లేదన్నారు. సమ్మె కాలపు వేతనాలు చెల్లించేందు గాను చర్యలు తీసుకుంటామని సిఎం కెసిఆర్ తనయుడు మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారన్నారు. తెలంగాణ తొలి రాష్ట్రంలో న్యాయం జరుగుతుందని భావిస్తే అన్యాయమే చేయాలని చూస్తే గ్రామ పంచాయతీ కార్మికుల, ఉద్యోగుల ఉసురు ఊరికే పోదని శాపనార్థాలు పెట్టారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని లేకపోతే డిసెంబర్ 10న పంచాయతీ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో గ్రామ పంచాయతీ కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.