జాతీయ వార్తలు

కేంద్రం చేతిలో సీబీఐ కీలుబొమ్మ:కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అరెస్టుపై కాంగ్రెస్ మండిపడింది. సీబీఐ, ఈడీ సంస్థలు కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారాయని, వీటిని అడ్డంపెట్టుకుని వ్యక్తిగత ప్రతీకారాలు తీర్చుకునేందుకు వాడుకుంటున్నారని ఆరోపించింది. కాంగ్రెస్ నేతలు రణ్‌దీప్‌ సుర్జేవాలా, సల్మాన్‌ ఖుర్షిద్‌ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రశ్నించే వారినే లక్ష్యంగా చేసుకున్నారని, ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితి, రూపాయి విలువ క్షీణత వంటి తీవ్రమైన అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే చిదంబరం అరెస్టు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ మహిళ మాటల ఆధారంగా..40ఏళ్ల నుంచి ప్రజా సేవ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేస్తారా?అని ప్రశ్నించారు.