క్రైమ్/లీగల్

క్రికెట్ బుక్కీ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, మే 28: ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీరాంనగర్‌కు చెందిన బండి లక్ష్మినరసయ్య క్రికెట్ పంద్యాలు నిర్వహిస్తుండగా అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ చిన్నపెద్దయ్య తన సిబ్బందితో కలిసి పట్టుకొని అరెస్టుచేసినట్లు ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ వెంకటశివారెడ్డి తెలిపారు. వివరాల్లోకెళ్తే... ఆదివారం రాత్రి ఐపియల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రామేశ్వరం నీళ్లట్యాంక్ వద్ద బెట్టింగ్ నిర్వహిస్తుండగా అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ చిన్నపెద్దన్న తన సిబ్బందితో కలిసి శ్రీరాంనగర్‌కు చెందిన బండి లక్ష్మినరసయ్యను అరెస్టుచేసి అతనివద్ద నుంచి 3,00,900 నగదు, 1 సెల్ ఫోన్, 1 క్రికెట్ బెట్టింగ్ బుక్కు, స్లిప్పులు, పెన్, ఒక ప్లాస్టిక్ కవర్లో 1130 గ్రాముల గంజాయి, 1 టీవీ, రిమోట్, 1 కుర్చీని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అయితే బండి లక్ష్మినరసయ్య 2016వ సంవత్సరంలో ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీసుస్టేషన్‌లో ఇతనిని అరెస్టుచేసినట్లు తెలిపారు. అలాగే 09-11-2017వ తేదీన వన్‌టౌన్ పోలీసులు మరోసారి బండి లక్ష్మినరసయ్యను మరో ముగ్గరిని అరెస్టుచేసి వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. అలాంటి వ్యక్తి మరోసారి ఐపియల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ నిర్వహించి అరెస్టు అయినట్లు వారు తెలిపారు.