జాతీయ వార్తలు

సెల్‌ఫోన్ కోసమే ఎస్పీ కిడ్నాప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్పీని రోడ్డుపై తోసేసి దుండగుల పరారీ
అదే ఫోన్‌నుంచే పాకిస్తాన్‌కు కాల్స్
సరిహద్దు వద్ద కనిపించిన వాహనం

పఠాన్‌కోట్, జనవరి 2: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై శనివారం ఆత్మాహుతి దాడి జరిపిన పాక్ ఉగ్రవాదులు అంతకుముందు గురుదాస్ పూర్ జిల్లా ఎస్‌పిగా పనిచేసిన సల్విందర్ సింగ్‌ను, అతని అనుచరులు మరో ఇద్దరిని శుక్రవారం తెల్లవారుజామున కిడ్నాప్ చేసి, ఆయన మొబైల్ ఫోన్‌ను తీసేసుకుని దానినుంచే పాక్‌కు ఫోన్లు చేసి ఉంటారని పంజాబ్ పోలీసులు అనుమానిస్తున్నారు. సల్విందర్ సింగ్ ఇటీవలే పంజాబ్ ఆర్మ్‌డ్ పోలీసు 75 బెటాలియన్‌కు అసిస్టెంట్ కమాండెంట్‌గా బదిలీ అయ్యారు. ఎస్‌పి అంగరక్షకుడి కథనం కూడా దీనికి బలం చేకూరుస్తోంది. సల్విందర్ సింగ్, ఆయన స్నేహితుడు రాజేష్ వర్మ, వంటమనిషి మోహన్‌లాల్‌తో కలిసి గురువారం తెల్లవారుజామున ఒక వాహనంలో ప్రయాణిస్తుండగా, పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గర్లో ఉన్న దీనానగర్ వద్ద మిలిటరీ దుస్తులు ధరించిన కొంతమంది ఆగంతకులు ఆయన వాహనాన్ని ఆపారు. అనంతరం వారు వాహనంలోని గన్‌మ్యాన్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టి ఆయన వాహనంలోనే కొంత దూరం వెళ్లారు. తర్వాత తనను, లాల్‌ను కారులోంచి బైటికి తోసేసారని, ఆ తర్వాత కొద్ది సేపటికి వర్మను కూడా వాహనంలోంచి తోసేసారని, అప్పుడు ఆయన శరీరంపై గాయాల గుర్తులున్నాయని ఎస్పీ చెప్పారు. గురువారం రాత్రి ఒక ఆలయంలో పూజలు జరిపిన తర్వాత తాము తిరిగి వస్తుండగా దుండగులు తమ వాహనాన్ని ఆపారని ఎస్‌పి చెప్పారు. కాగా, భారత్-పాక్ సరిహద్దు సమీపంలోని ధీరా సమీపంలోని తాజ్‌పూర్ గ్రామం వద్ద ఎస్పీ వాహనాన్ని పోలీసులు కనుగొన్నారు.
ఎస్పీ ఫోన్‌లో ‘సలామ్ ఆలేకుమ్’
ఆగంతకులు దాడి చేసి కొట్టిన ఎస్‌పి అంగరక్షకుడు తర్వాత ఆయన మొబైల్ నంబరుకు ఫోన్ చేసినప్పుడు అవతలి వైపునుంచి ‘సలామ్ ఆలేకుమ్’ అంటూ సమాధానం వచ్చింది. కాగా, ఆ నంబరు ఎస్పీ మొబైల్‌దని అంగరక్షకుడు కాల్ అందుకున్న వ్యక్తికి చెప్పగానే అతను ఫోన్ డిస్‌కనెక్ట్ చేసాడు. పాకిస్తాన్‌కు ఫోన్ చేయడం కోసం టెర్రరిస్టులు ఉపయోగించుకున్నట్లుగా భావిస్తున్న ఎస్పీ మొబైల్‌లో జరిగిన చివరి సంభాషణ కూడా అదే.
ఎస్పీని ఆగంతకులు కిడ్నాప్ చేసినప్పటినుంచీ ఆయన మొబైల్ నంబరుకు తాను ఫోన్లు చేస్తూనే ఉన్నానని, అయితే చాలా సేపటివరకు ఆ నంబరు కనెక్ట్ కాలేదని ఎస్పీ గన్‌మ్యాన్ కుల్విందర్ సింగ్ చెప్పాడు. చివరికి తెల్లవారుజామున 3 గంటల 26 నిమిషాలకు నంబరు కనెక్ట్ అయిందని అతను చెప్పాడు. తాను హలో అనగానే అవతలి వైపునుంచి ‘సలామ్ ఆలేకుమ్’ అని సమాధానం వచ్చిందని అతను చెప్తూ, మీరెవరని తాను అడగ్గా, కాల్ అందుకున్న వ్యక్తి మీరెవరని ఎదురు ప్రశ్నించినట్లు చెప్పాడు. ఇది ఎస్పీ సాబ్ మొబైల్ నంబరని తాను చెప్పగానే ఎస్పీ సాబ్ ఎవరని అవతలి వ్యక్తి ప్రశ్నించాడని, ఆ వెంటనే డిస్‌కనెక్ట్ చేసాడని అతను చెప్పాడు. ఆ తర్వాత తాను ఎన్నిసార్లు హలో..హలో అని అన్నప్పటికీ అవతలివైపునుంచి ఎలాంటి సమాధానం రాలేదని అతను చెప్పాడు. ఎస్పీ సల్విందర్ సింగ్ వద్ద కుల్విందర్ సింగ్ అయిదు సంవత్సరాలుగా గన్‌మ్యాన్‌గా పని చేస్తున్నాడు.