జాతీయ వార్తలు

తిరోగమనంలో కేంద్ర ఆర్థిక నిర్ణయాలు:చిదంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో ఉన్న మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం నిన్న బెయిల్ మంజూరవ్వటంతో విడుదల అయ్యారు. ఆయన పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. ఉల్లి ధరలపై కాంగ్రెస్ ఎంపీలు నిర్వహించిన నిరసన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక విధానాలపై విరుచుకుపడ్డారు. కేంద్ర విధానాలు తిరోగమనంలో ఉన్నాయని అన్నారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, ప్రధాని మోదీ ఆర్థిక అంశాల గురించి అసలు ప్రస్తావించరని, ఉల్లి ధరలు పెరిగినా ఈ ప్రభుత్వానికి పట్టదని అన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో తాను ఏమి చేశానో మీ అందరికీ తెలుసునని అన్నారు. 106 రోజుల జైలు జీవితం అనంతరం స్వచ్ఛావాయువులు పీల్చుకున్నానని అన్నారు.