రాష్ట్రీయం

నేడు కరవు బృందం రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోమ, మంగళవారాల్లో జిల్లాల్లో పర్యటన

హైదరాబాద్, డిసెంబర్ 5: కేంద్రం నుంచి మూడు కరవు బృందం ఆదివారం హైదరాబాద్‌కు చేరుకోనుంది. ఈ బృందంలోని అధికారులు మూడు బృందాలుగా విడిపోయి సోమ, మంగళవారాల్లో వేర్వేరు జిల్లాల్లో పర్యటిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న కరవు పరిస్థితులను కేంద్రానికి వివరించేందుకు అధికారులు జిల్లాల వారీగా నివేదికలు రూపొందించారు. కరవు బృందం తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై ఆ తర్వాత జిల్లాల్లో పర్యటిస్తుంది. నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఒక బృందం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో రెండవ బృందం, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో మూడవ బృందం పర్యటిస్తుంది. కరవు పరిస్థితులపై ఈ బృందానికి అధికారులు సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు. జిల్లాల వారీగా వర్షపాతం, కరవు పరిస్థితులపై నివేదికలు రూపొందించారు. కరవు సహాయం కింద తక్షణమే రూ.1000 కోట్లు మంజూరు చేసి, రైతులను ఆదుకునేందుకు తగిన సహకారం అందించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే కేంద్రాన్ని కోరిన విషయం విదితమే. రాష్ట్ర ఎంపీలు సైతం కేంద్ర మంత్రులను కలిసి కరవు సహాయం కింద రూ.2,500 కోట్లు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో నెలకొన్న కరవుపై ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ నాయకత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించిన విషయం తెలిసిందే. కరవు గురించి కేంద్ర బృందానికి సమర్పించాల్సిన నివేదికలపై పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ.సింగ్ శనివారం సచివాలయం నుంచి టిడిడబ్ల్యుఎస్‌పి, ఆర్‌డబ్ల్యుఎస్ జిల్లా ఎస్‌ఇలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, 231 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించారు. వర్షాభావం వలన రాబోయే రోజుల్లో తాగునీటికి సైతం తీవ్ర ఇబ్బందులు తప్పవని అంచనా వేసిన రాష్ట్ర అధికారులు ఈ వివరాలను కేంద్ర బృందానికి అందజేస్తారు.