రాష్ట్రీయం

కరవు పరిస్థితి తీవ్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలులో పర్యటించిన కేంద్ర బృందం

కర్నూలు, డిసెంబర్ 10: కర్నూలు జిల్లా కరవు కోరల్లో చిక్కుకుందని, ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని కేంద్ర కరవు బృందం చైర్మన్ షకీల్ అహమ్మద్ అన్నారు. ఈ బృందం సభ్యులు గురువారం కర్నూలు జిల్లా ఆస్పరి, దేవనకొండ మండలాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి క్షామ పరిస్థితులను అధ్యయనం చేశారు. పలుచోట్ల రైతులతో మాట్లాడారు. గత పదేళ్ల నుంచి వర్షపాతం, పంటల సాగు, దిగుబడి తదితర అంశాల గురించి జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాము పరిశీలించిన ప్రతిచోటా వర్షాభావ పరిస్థితులతో రైతులు నష్టపోయిన విషయం స్పష్టంగా కళ్లకు కట్టినట్లు కనిపించిందని బృందం సభ్యులు వ్యాఖ్యానించారు. ఇంత కరవును తాము గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. కరవు కారణంగా తలెత్తే ఇబ్బందులకు బెదిరి ప్రాణాలు తీసుకోవద్దని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేస్తాయని రైతులకు భరోసా ఇచ్చారు. రైతులకు జరిగిన నష్టం, ఆర్థిక ఇబ్బందులపై సంపూర్ణ నివేదిక ఇచ్చి న్యాయం జరిగేలా సిఫారసు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు వేసిన పంటలు, పెట్టుబడి, నష్టం, బ్యాంకు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకున్న రుణాల వివరాలపై బృందం ఆరా తీసింది. బృందంలో నరేంద్రకుమార్, సలీం హైడెన్, కృష్ణారావు ఉన్నారు. వారి వెంట కలెక్టర్ విజయమోహన్ ఉన్నారు.