సెంటర్ స్పెషల్

ఒక్క తూటా చాలు 6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాల్ కట్ అయింది.
అప్పటికప్పుడు ఆమె ముఖం వాడిపోయింది. కదలకుండా అలాగే నిలబడింది. ఆమె కళ్లల్లో సన్నటి నీటిపొర ప్రత్యక్షమయింది. ఒకే ఒక్కసారి చేసిన తప్పుకి బురదలో కూరుకుపోయింది. దాని నుండి ఎలా బయటపడాలో, అసలు బయటపడటానికి మార్గం ఉందో లేదో తెలియడం లేదు.
దీనికంతటికీ కారణమైన సంఘటన ఆమె మనసులో మెదిలింది.
* * *
ఆ రోజు ఆదివారం.
ఉదయం పది గంటల సమయంలో లేడీస్ హాస్టల్ దగ్గర చెట్టు కింద బైక్ ఆపాడు వివేక్. జేబులోంచి సెల్ తీసి ఓ నెంబరు డయల్ చేసి రెండుసార్లు రింగయ్యాక కట్ చేశాడు. పాతికేళ్ల వివేక్ స్మార్ట్‌గా ఉన్నాడు. అతను వేసుకున్న టీషర్ట్, జీన్ ప్యాంటు నుంచి ఎవా స్ప్రే వాసన వెలువడుతోంది.
హాస్టల్ బయట అక్కడక్కడ అమ్మాయిలు ఉన్నారు. వారందర్ని ఓసారి పరీక్షగా చూశాడు. అన్నీ పువ్వులే... దేని ప్రత్యేకత దానిది... అనుకుని చిన్నగా నవ్వేడు.
పది నిమిషాలకి హాస్టల్ నుంచి బయటకొచ్చింది స్వప్న. అప్పుడే విరిసిన గులాబీలా ఉందామె. మెచ్చుకోలుగా తలూపి బైక్ స్టార్ట్ చేశాడు వివేక్. ఆమె కూర్చున్న మరుక్షణం కదిలింది బైక్. రెండు చేతులతో అతని నడుము పట్టుకుని కూర్చుంది స్వప్న. ఇద్దరి మధ్య గాలి దూరడానికి సందులేదు. నిత్యం అలాంటి దృశ్యాలు కనపడుతూనే ఉంటాయి కాబట్టి జనం పట్టించుకోవడంలేదు.
ఓ డిపార్ట్‌మెంటల్ స్టోర్ దగ్గర బైక్ ఆపాడు వివేక్. ఇద్దరూ లోపలికి వెళ్లి కొన్ని వస్తువులు పర్చేజ్ చేశారు. అక్కడ నుంచి బయలుదేరి అయిదు నిమిషాల్లో జూ ఎదురుగా వున్న తొట్లకొండ చేరుకున్నారు. వివేక్ రెండు ఎంట్రన్సు టిక్కెట్లతో కాటేజి టిక్కెట్ తీసుకున్నాడు. ఎంట్రన్స్ నుండి లోపలికి ఓ అర కిలోమీటరు వెళ్లాక ఒక పక్క కుర్చీలో కూర్చున్న వాచ్‌మన్‌కి టికెట్ చూపించాడు వివేక్. దాని మీదున్న నెంబర్ చూసి ఎటువెళ్లాలో చెప్పాడతను. మరి కొంత దూరం లోపలికి వెళ్లాక అక్కడక్కడ విసిరేసినట్టు కనిపించాయి కాటేజీలు.
ఉదయం పది నుంచి సాయంకాలం ఆరు వరకూ అక్కడ కాటేజీలు అద్దెకిస్తారని చాలామందికి తెలియదు. తెలిసిన వారిలో ప్రేమికులే అధిక శాతం ఆ ప్రాంతంలోకి కాటేజీలు బుక్ చేసుకున్న వారికి తప్ప ఇతరులకు ప్రవేశం ఉండదు.
స్వప్నతోపాటు కాటజీలోకి ప్రవేశించిన వివేక్, తలుపు మూసి ఫ్యాన్ స్విచ్ వేశాడు. ఆ తర్వాత తెరచి వున్న కిటికీ నుంచి బయటకు చూశాడు. అంతా నిశ్శబ్దంగా, నిర్మానుష్యంగా ఉంది. చుట్టూ పచ్చటి చెట్లతో అడవిలా కనిపిస్తోంది. వాటర్ బాటిల్, పెట్ కూల్‌డ్రింక్, బిస్కట్స్ వున్న బ్యాగ్ టేబిల్ మీద ఉంచింది స్వప్న. ఆమె గుండె స్వల్పంగా కంపిస్తోంది.
‘ఏమిటి ఆలోచిస్తున్నావ్?’ అడిగేడు వివేక్.
‘ఏం లేదు’ చెప్పింది.
‘ఈ ప్రదేశం బాగుందా?’
‘లేదు. భయంగా ఉంది’
‘దేనికి?’
‘నిన్ను నమ్మి వచ్చాను. ఎవరికైనా తెలిస్తే బాగుండదు’
‘యూ సిల్లీ...’ అంటూ వెనుక నుంచి గుండెలకు హత్తుకున్నాడు ఆమెని.
ఆ స్పర్శకి స్వప్న శరీరం జలదరించింది. మరింత గట్టిగా హత్తుకుంటూ అలాగే నడిచి ఆమెతోపాటు మంచం మీద వెల్లకిలా పడ్డాడు. ఇద్దరి శరీరాల్లో రక్తం వడివడిగా పరుగెత్తసాగింది.
ఆ రోజు రాత్రి ఏడు గంటలకి స్వప్నని హాస్టల్ దగ్గర దించి వెళ్లిపోయాడు వివేక్. తలస్నానం చేసి, మెస్‌లో భోజనం ముగించుకుని నిద్రపోవడానికి మంచమెక్కిన స్వప్న సెల్‌కి రాత్రి తొమ్మిది దాటాక ఓ కాల్ వచ్చింది.
‘హల్లో...’ యథాలాపంగా ఆన్సర్ చేసింది.
‘ఎంత కోరిక ఉంటే మాత్రం పార్ట్‌నర్ వీపు మీద గోళ్లతో గుచ్చుతారా?’ అటు నుంచి వినిపించింది.
‘వ్వాట్..?’ అదిరిపడింది స్వప్న.
‘నీకు తెలియకపోవచ్చు. వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది’
చప్పున సెకండ్ ఫ్లోర్‌లోని తన రూమ్ నుంచి బయటకొచ్చిందామె.
‘ఎవరు మీరు? ఏం మాట్లాడుతున్నారు?’ ఆందోళనగా అడిగింది.
‘నేను ఏం మాట్లాడుతున్నానో నీకు తెలుసు. ఇకపోతే నా గురించి తెలుసుకోవడం అంత ముఖ్యం కాదు. తొట్లకొండ కాటేజీలో జరిగిన శృంగారమంతా రికార్డయ్యింది. మార్కెట్‌లోకి విడుదల చేస్తే సెనే్సషన్ క్రియేట్ చేస్తుంది’
మతిపోయిన దానిలా ఉండిపోయింది స్వప్న.
‘అనవసరంగా దాన్ని బయటపెట్టను కాబట్టి నువ్వేం కంగారుపడకు’
‘నా దగ్గర డబ్బు లేదు’ గొంతు పెగుల్చుకుని చెప్పింది.
‘తెలుసు... రేపు మళ్లీ కాల్ చేస్తాను’
కాల్ కట్ అయింది.
పిచ్చిపట్టిన దానిలా చుట్టూ చూసింది స్వప్న. హాస్టల్ ఎంట్రన్స్‌లో తప్ప ఎక్కడా వెలుతురు లేదు. ఆ నిశీధిలో ఆమె గుండెలు దడదడ కొట్టుకుంటున్నాయి. అప్పటికప్పుడు ముఖం పీక్కుపోయింది. వెంటనే వివేక్ సెల్‌కి కాల్ చేసింది.
స్విచ్డ్ ఆఫ్.
ఎన్నిసార్లు చేసినా ఉపయోగం లేకపోయింది. ఆ రాత్రి నిద్ర పట్టలేదు స్వప్నకి. ఈ సమస్యని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా తన జీవితం అంధకారమైనట్టు తోచింది. మరునాడు ఉదయం ఆమె సెల్‌కి మళ్లీ కాల్ వచ్చింది.
‘మీ హాస్టల్ పక్కనున్న బస్‌స్టాప్‌కి రా. ఒకతను నిన్ను కలిసి భూపతి మనిషిని అని చెబుతాడు. అతనితో మాట్లాడు...’ చెప్పి కాల్ కట్ చేశారు.
స్వప్న వెళ్లకూడదనుకుంది. కాని వెళ్లకపోతే విషయం ఏమిటో తెలియదు. అంతేకాదు, ఆ తర్వాత వాళ్లు ఎలా రియాక్టవుతారో కూడా తెలియదు. భారమైన గుండెలతో జంకుతూ బస్‌స్టాప్ దగ్గరకు వెళ్లింది. అప్పటికే అక్కడున్న ఓ మనిషి ఒక కవరు చేతిలో పెట్టి చెప్పాడు.
‘తెరిచి చూడు’
వణుకుతున్న చేతులతో లోపలి నుండి ఓ ఫొటో బయటకు తీసింది. మంచం మీద రెండు నగ్న శరీరాలు ఫొటోకి పోజిచ్చినట్టు అమ్మాయి ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. చప్పున లోపలికి నెట్టేసింది దాన్ని. ఆ వ్యక్తి సెల్‌లో ఎవరితోనో మాట్లాడి ఫోన్ స్వప్న చేతికిచ్చి కవరు తీసుకున్నాడు.
‘్ఫటో చూశావు కదా! నేను చెప్పింది అబద్ధం కాదని నువ్వు తెలుసుకోవాలని పంపాను. నెలకి ఒకటి లేదా రెండుసార్లు వీకెండ్‌లో నీతో పని పడుతుంది. ఆ రోజు రాత్రి హాస్టల్ దగ్గర నుండి కారులో బయలుదేరి ఉదయం తిరిగి హాస్టల్ దగ్గర దిగుతావు. ఇదంతా కాన్ఫిడెన్షియల్ కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. నెలకి పది వేలు నీ అకౌంట్‌కి జమ అవుతుంది. ఇది పార్ట్‌టైమ్ ఉద్యోగం అనుకో. లేదంటే నా పని నేను చేసుకుపోతాను’ అటు నుంచి చెప్పింది రాత్రి మాట్లాడిన గొంతు.
‘ఏమిటిదంతా? నేనేం పాపం చేశానని వేధిస్తున్నారు?’ బొంగురు పోయిన గొంతుతో అడిగింది స్వప్న. కన్నీళ్లు చెంపల మీద నుంచి జారుతున్నాయి.
ఆమె బాధని రెట్టింపు చేస్తూ అవతల నుంచి నవ్వు వినిపించింది.
‘నీ బాయ్‌ఫ్రెండ్‌తో సెక్స్‌లో పాల్గొన్న దృశ్యాల్ని నెట్‌లో పెట్టినా లేదా ఫ్లెక్సీ బోర్డులు తయారుచేయించి మీ కాలేజీ చుట్టుపక్కల ప్రదర్శనకి ఉంచినా అది వేధింపు అవుతుంది. నీ రహస్యం దాచినందుకు బదులుగా డబ్బివ్వలేవు. నేనే నెలకి పదివేలు ఇస్తానంటున్నాను. మరెందుకు ఆందోళన?’
ఆమె దగ్గర సమాధానం లేకపోయింది.
ఆ తర్వాత పది రోజుల పాటు వివేక్ కోసం ప్రయత్నించింది. ఫోన్‌లో దొరకలేదు. తను చదువుతున్నానని అతను చెప్పిన కాలేజీకి వెళ్లింది. ఆ డిపార్ట్‌మెంట్‌లో వివేక్ అనే యువకుడు ఎవరూ లేరు. తనని తెలివిగా ట్రాప్‌లోకి లాగి అతను తప్పుకున్నాడని అర్థం చేసుకుంది.
* * *
ప్రశాంతంగా జీవించే విశాఖపట్నం ప్రజలు ఒక్కసారిగా త్రుళ్లిపడ్డారు.
బ్యాంక్ ఆఫీసర్ రాంప్రసాద్‌ని హత్య చేసినందుకు ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడమే దానికి కారణం.
మధురవాడలో ఆరు ఎకరాల భూమి అమ్మకానికి సిద్ధంగా ఉంది. దాన్ని కొనడానికి కోటిన్నర, అభివృద్ధి చేసి ఇంటి స్థలాలుగా మార్చడానికి మరో యాభై లక్షలు కావాలి. అందుచేత పాత పరిచయం ఉన్న రాంప్రసాద్‌ని కన్విన్స్ చేసి పార్ట్‌నర్‌గా తీసుకున్నాడు రాజిరెడ్డి. బ్యాంక్ నుండి పదిహేను లక్షలు పర్సనల్ లోను తీసుకుని తన వంతు పెట్టుబడి పెట్టడమే కాకుండా రాజిరెడ్డికి, సుందరానికి చెరో పాతిక లక్షలు లోన్ ఇచ్చాడు.
ఆ వెంచర్‌లో తన వాటాకి వచ్చిన ఆరు ఇంటి స్థలాలు అమ్మి బ్యాంక్ లోన్ తీర్చేశాడు రాంప్రసాద్. ఆ తర్వాత పదెకరాల భూమి కొనుగోలు పాలుపంచుకున్నాడు. ఈసారి కూడా తన వాటా స్థలాలు అధిక శాతం అమ్మేసి గ్రూప్ హౌస్ కొన్నాడు. మిగిలిన సొమ్ము కుటుంబ సభ్యుల పేర డిపాజిట్ చేశాడు.
రేటు మరింత పెరుగుతుందన్న నమ్మకంతో రాజిరెడ్డి తన భాగస్వామితో కలిసి సైట్లు అమ్మలేదు. ఇంతలో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలింది. దానితో రాజిరెడ్డి, సుందరం దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అప్పుడే బ్యాంక్ లోన్ చెల్లించమని వత్తిడి చేశాడు రాంప్రసాద్.
తమ భాగస్వామే తమకి తలనొప్పిగా తయారుకావడంతో ఏం చెయ్యాలో అర్థం కాలేదు భాగస్తులకి. తండ్రుల పేరు మీద తప్పుడు పత్రాలు సమర్పించి లోన్ తీసుకున్న విషయం ఒక్క రాంప్రసాద్‌కే తెలుసు. అతను తలుచుకుంటే తాము జైలుకి వెళ్లడం ఖాయం. అందుచేత అతన్ని తమ మార్గం నుంచి తప్పించాలని, అలా చెయ్యడం వల్ల, రెండో వెంచర్లో అమ్మగా మిగిలిన రాంప్రసాద్ సైట్లు తమ స్వంతమవుతాయని భావించారు.
పథకం ప్రకారం మధ్యాహ్నం రెండున్నరకి రాంప్రసాద్‌ని తీసుకుని కారులో మధురవాడ వచ్చాడు రాజిరెడ్డి. అక్కడ రెడీగా ఉన్న సుందరాన్ని తీసుకుని తమ లే అవుట్‌లోని మామిడి చెట్ల దగ్గర ఆగారు. ముగ్గురూ మందు తాగుతూ కూర్చున్నారు. అయిదు దాటాక లే అవుట్‌లోకి వెళ్లి అక్కడ రాంప్రసాద్‌ని హతమార్చారు. అతని గుర్తులు దొరక్కుండా సెల్, పర్సు వంటి వస్తువులు తీసుకెళ్లి దూరంగా నిర్మానుష్య ప్రదేశంలో కప్పెట్టారు.

(మిగతా వచ్చే సంచికలో)

-మంజరి 9441571994