క్రీడాభూమి

వోగ్స్, షాన్ అజేయ శతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియా 3 వికెట్లకు 438 * వెస్టిండీస్‌తో మొదటి టెస్టు
హోబర్ట్, డిసెంబర్ 10: వెస్టిండీస్‌తో ఫ్రాంక్ వారెల్ ట్రోఫీ కోసం గురువారం మొదలైన మొదటి టెస్టు మొదటి రోజు ఆటలో ఆడమ్ వోగ్స్, షాన్ మార్ష్ అజేయ శతకాలతో రాణించగా, ఆస్ట్రేలియా మూడు వికెట్లకు 438 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు జో బర్న్స్, డేవిడ్ వార్నర్ జోడీ 75 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని అందించింది. బర్న్స్ 33, వార్నర్ 64 పరుగులు చేసి అవుట్‌కాగా, కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 10 పరుగులకే వెనుదిరిగాడు. 121 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌కు వోగ్స్, షాన్ అండగా నిలిచారు. వీరిద్దరూ మొదటి రోజు ఆట ముగిసే వరకూ బ్యాటింగ్‌ను కొనసాగించి, అజేయ శతకాలను నమోదు చేశారు. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లలో మూడు వికెట్లకు 438 పరుగులు సాధించగా, అప్పటికి వోగ్స్ 174, షాన్ 139 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

మళ్లీ ఓడిన శ్రీకాంత్
దుబాయ్, డిసెంబర్ 10: బిడబ్ల్యుఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ వరుసగా రెండో రౌండ్ రాబిన్ మ్యాచ్‌ని కూడా కోల్పోయాడు. గురువారం విక్టర్ అక్సెల్సెన్‌తో తలపడిన అతను 13-21, 13-21 తేడాతో ఓడాడు.

గిరౌడ్ హ్యాట్రిక్
పారిస్, డిసెంబర్ 10: ఆలివర్ గిరౌడ్ హ్యాట్రిక్‌తో రాణించడంతో ఒలింపికోస్ ఫుట్‌బాల్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌ని 3-0 తేడాతో గెల్చుకున్న ఆర్సనెల్ జట్టు చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్ 29, 49, 67 నిమిషాల్లో గిరౌడ్ గోల్స్ సాధించాడు.