చిత్తూరు

అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తవణంపల్లె, మార్చి 19: మండలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ విస్తృతంగా పరిశీలించారు. మండలంలోని గోవింవదరెడ్డిపల్లి వద్ద కుయ్యవంక నుండి సప్లై చానల్ పనులు జరుగుతుంది. ఇరిగేషన్ శాఖ ద్వారా 1కోటి 8లక్షల అంచనాలతో జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించి రైతులకు సాగునీరు అందే విధానంపై అధికారులతో చర్చించి తెలుసుకున్నారు. మండలంలో ఆ చెరువులకు యుయ్యవంక ద్వారా సాగునీరు అందుతుందని అధికారులు వివరించారు. యడమలవారిపల్లిలో అర్ధాతరంగా నిలిచిపోయిన వడియాల చెరువు ప్రాజెక్టుల పనులను పరిశీలించారు. అదే విధంగా దిగువమోదలపల్లి గ్రామంలో పశుసంవర్థకశాఖ వారు ప్రదర్శించిన పేయదూడలు, చూలి ఆవులు శంకరజాతి, జర్సీ ఆవుల ప్రదర్శణ, గొర్రెల పెంపకం, వనరాజకోళ్ల పెపంకం తదితర ప్రదర్శనలను తిలకించి వాటి ద్వారా వచ్చే ఆదాయ వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీతం పాటు పైపల్లె వద్ద భూగర్భ జలాల నీటి మట్టం ప్రదర్శనను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌తో పాటు ఇరిగేషన్ ఎస్ సి రామకృష్ణ, డ్వామా పిడి వేణుగోపాల్‌రెడ్డి, డిపి ఒ ప్రభాకర్‌రెడ్డి, ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, డి ఇ సుధాకర్‌రెడ్డి, పశుసంవర్థకశాఖ డిడి శ్రీనివాసులు, ఎడి సునీల్‌కుమార్, గోవిందరెడ్డి, ఎంపిపి సరళకుమారి, ఎంపిడి ఒ రవికుమార్, తహశీల్దార్ వరలక్ష్మి, జడ్పిటిసి వెంకటేశ్వరచౌదరి తదితరులు పాల్గొన్నారు.