చిత్తూరు

పన్నుల వసూలులో నిర్లక్ష్యం వహిస్తే సిబ్బంది జీతాల్లో కోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 19: పన్నుల వసూలులో నిర్లక్ష్యంగా వ్యవహరించి వసూలు చేయడంలో వెనుకబడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు వారి జీతాల్లో కోత విధించడం జరుగుతుందని అలాగే మరో విభాగానికి బదిలీ చేయడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ వినయ్‌చంద్ స్పష్టం చేశారు. నగరంలో జరుగుతున్న పన్నుల వసూళ్ల తీరు తెన్నులను పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే నగరంలోని భవన యజమానులు, వ్యాపారులు వెంటనే తాము చెల్లించాల్సిన ఆస్తి, నీటి పన్నులు, యూడి ఎస్ చార్జీలు, ట్రేడ్ లైసెన్సులు, ప్రకటన పన్నులు సకాలంలో చెల్లించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వందశాతం పన్ను వసూలు చేసి నివేదికను పంపించాల్సి ఉందని అన్నారు. ఈకార్యక్రమంలో ఉప కమిషనర్ భాగ్యలక్ష్మి, రెవెన్యూ అధికారి సేతుమాధవన్, రెవిన్యూ ఇన్స్‌పెక్టర్లు పాల్గొన్నారు.