చిత్తూరు

ఆలయం కూల్చివేసి స్థలం ఆక్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, మార్చి 19: చంద్రగిరి మండలం రాయలపురం గ్రామానికి సమీపంలో ఉన్న ఆంజనేయులస్వామి గుడిని ఒకరు జెసిబితో కూల్చివేసి అందులో ఉన్న విగ్రహాలను కంపచెట్లలో వేసి స్థలం ఆక్రమించడంతో రాయలపురం గ్రామస్థులు అతనిపై అటు రెవెన్యూకు, ఇటు పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయలపురం గ్రామానికి తూర్పున రాయలవారి కాలం నాటి అతి పురాతనమైన ఆంజనేయస్వామి ఆలయం ఉండేది. అయితే ఆ గుడిలో ఒకప్పుడు రాయలపురం గ్రామస్థులు నిత్యం పూజలు నిర్వహించేవారు. ఆలయం ఆలనా పాలనా చూసేవారు. అయితే కొద్దిరోజులుగా ఆలయంలో పూజలు నిలిచిపోవడం, ఆలయం వైపుగ్రామస్థులు ఎవరూ వెళ్లకపోవడంతో ఆలయం శిథిలావస్థకు చేరింది. ఆలయానికి ఆనుకొని 2 ఎకరాల 76 సెంట్లు కాలవ పొరంబోకు స్థలం ఉంది. రాయలపురం దళితులకు ఈ స్థలంలో ఇంటి స్థలాలను 2008వ సంవత్సరంలో అప్పటి తహశీల్దార్ భాస్కర్‌నాయుడు మంజూరుచేశారు. అయితే రాయలపురం గ్రామస్థులు కూడా అటువైపు వెళ్లి ఎవరూ ఇండ్లు నిర్మించుకోకపోవడంతో ఆ స్థలం వృధాగా ఉంది. దీంతో చంద్రగిరికి చెందిన రాజులగారి నాదమునిరెడ్డి అనే వ్యక్తి ఈ మొత్తం స్థలాన్ని ఆక్రమించుకొని, ఆలయాన్ని జెసిబితో తొలగించి కడగాలను ఒడ్డుకు తోసివేసి చదునుచేశాడు. విగ్రహాలను ముండ్లకంపల వద్ద ఓ చెట్టుకు ఆనిచ్చి వదిలేశాడు. గ్రామస్థులు వెళ్లి అడుగ్గా దురుసుగా సమాధానం చెప్పారని, రాయలపురం గ్రామస్థులు స్థానిక పోలీసులను, అధికారులకు ఫిర్యాదుచేసి న్యాయం చేయాలని, ఆలయాన్ని తిరిగి నిర్మించాలని కోరారు.