చిత్తూరు

తిరుమలలో ఘనంగా చక్రస్నానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 22: ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో చక్రతాళ్వార్‌కు చక్రస్నానం నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులు పెద్దఎత్తున పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. మంగళవారం తెల్లవారుఝామున ప్రాతంలో స్వామివారి సుదర్శన చక్రాన్ని ఊరేగింపుగా వరహస్వామి ఆలయం ప్రాంతంకు తీసుకెళ్లారు. ఈసందర్భంగా అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుఝామున 4.30గంటలనుండి 5గంటల మధ్య శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు.
ఈకార్యక్రమంలో టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, టిటిడి ఈఓ డాక్టర్ డి.సాంబశివరావ్, జెఈఓ శ్రీనివాసరాజు, బోర్డు సభ్యులు వైద్యనాథన్‌కృష్ణమూర్తి పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈసందర్భంగా టిటిడి చైర్మెన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి భక్తులతో వైకుంఠ ఎకాదశి, ద్వాదశి ఏర్పాట్లకు సంబంధించి ఆరా తీశారు. ఈసందర్భంగా భక్తులు గతంలో ఎన్నడూలేనివిధంగా తాము స్వామివారిని ఎంతో సంతోషంగా దర్శించుకున్నట్లు తెలిపారు.
ఘనంగా వైకుంఠ ఏకాదశి
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని 87వేల 903మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కాగా ద్వాదశిరోజైన మంగళవారం ఉదయం 3గంటలనుండి 4గంటల వ్యవధిలో 17వేలమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కాగా భక్తుల రద్దీ తగ్గడంతో మధ్యాహ్నం వరకు రెండు గంటల వ్యవధిలోనే స్వామివారిని దర్శించుకునే అవకాశం భక్తులకు కలిగింది. కాగా మధ్యాహ్నం భక్తుల రద్దీ పెరగడంతో నాలుగు గంటల సమయం దర్శనానికి వేచిఉండాల్సి వచ్చింది. ఏదిఏమైనా వైకుంఠఏకాదశి రోజున భక్తుల సంఖ్య అత్యధికంగా వచ్చినప్పటిటకి టిటిడి ఈఓ డాక్టర్ డి సాంబశివరావ్ ముందస్తు ప్రణాళికతో చేసిన ఏర్పాట్లుభక్తులు అందరికీ వైకుంఠద్వార ప్రవేశం సులభంగా చేయడానికి మార్గం సుగమమమైంది.
టిటిడి దేవాలయాల్లో ఘనంగా చక్రస్నానం
తిరుపతి: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల నేపథ్యంలో మంగళవారం ద్వాదశి పర్వదినాన తిరుచానూరు పద్మవతి అమ్మవారి ఆలయానికి చెందిన పద్మసరోవరంలో అంగరంగ వైభవంగా, శ్రాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం నిర్వహించారు. వైకుంఠద్వాదశిరోజును, ముక్కోటి ద్వాదశి అని అంటారు. ఈపర్వదినాన చక్రతాల్వార్ నిర్వహించే చక్రస్నాన సమసమయంలో పుష్కరిణిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు హరించకుపోవడంతోపాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. అందుకే ఈపర్వదినాన భక్తులు పెద్దఎత్తున పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. కాగా టిటిడి అనుబంధ ఆలయమైన అప్పలాయగుంట, నారాయణవణం, శ్రీనివాసమంగాపురంలో కూడ ఈచక్రస్నానం ఆచరించారు. పెద్దఎత్తున భక్తులు ఆలయాలను సందర్శించి చక్రస్నానం సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించారు.