రాష్ట్రీయం

చంపేస్తున్న చలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరిగిన ఈశాన్య గాలుల తీవ్రత
తగ్గుతున్న పగటి ఉష్ణోగ్రతలు
మరో 4రోజులు ఇదే పరిస్థితి

విశాఖపట్నం, డిసెంబర్ 26: ఉత్తర ఈశాన్య దిశగా భూఉపరితలం మీదుగా ఉత్తరాదినుంచి వీస్తున్న గాలులతో తెలుగు రాష్ట్రాల్లో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. గత రెండు రోజులుగా చలిగాలులకు ఇదే కారణమని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. పగటి, రాత్రి ఉష్ణోగ్రతల్లో సగటున 3నుంచి 5 డిగ్రీలమేర తగ్గుదల చోటుచేసుకుంది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా అతిశీతల గాలుల తీవ్రతను ఎదుర్కొంటుంటే, ఆంధ్రలోని ప్రధాన నగరాలతోపాటు విశాఖ ఏజెన్సీలో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోవడంతో చలిగాలుల తీవ్రత పెరిగింది. విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి, లంబసింగి, మినమలూరు, అరకు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో గిరిజన ప్రాంతమంతా మంచుదుప్పటి పరచుకుంది. ఇక్కడ సాధారణ ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల వరకూ ఉండాల్సి ఉండగా, నాలుగు డిగ్రీల మేర పడిపోయినట్టు వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం విశాఖ ఏజెన్సీ పరిధి లంబసింగిలో 8 డిగ్రీలు, చింతపల్లిలో 9 డిగ్రీలు మినమలూరులో 8 డిగ్రీలు, అరకులో 10 డిగ్రీల ఉష్ణోత్రలు నమోదయ్యాయి. అలాగే విశాఖ నగరంలో సాధారణ ఉష్ణోగ్రత 24 డిగ్రీలు ఉండాల్సి ఉండగా, 20 డిగ్రీలుగా నమోదైంది. అలాగే గన్నవరం 16 డిగ్రీలు, కళింగపట్నం 19 డిగ్రీలు, కాకినాడ 21 డిగ్రీల మేర పగటి ఉష్ణోత్రలు నమోదయ్యాయి. సాధారణం కంటే ఇది 3 డిగ్రీలు తక్కువని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయని, ముఖ్యంగా ఆదిలాబాద్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో కూడా పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నట్టు పేర్కొన్నారు. ఉత్తరాది నుంచి వచ్చే గాలుల ప్రభావం ఇదే తీరున కొనసాగితే మరో నాలుగైదు రోజులపాటు చలిగాలు తప్పవని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పగటి ఉష్ణోత్రలు గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో అల్పపీడనం వంటివి ఏర్పడే అవకాశాలు పెద్దగా ఉండవని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
అతిశీతల పవనాలు
ఉత్తరాది నుంచి వీస్తున్న అతిశీతల పవనాలు ఆదిలాబాద్ జిల్లా ప్రజల్లో వణుకుపుట్టిస్తున్నాయి. అమాంతంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జనజీవనం స్థంభిస్తోంది. మొన్నటివరకు 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకాగా శుక్రవారం నుంచి వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల ప్రభావంతో రికార్డుస్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం 4.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత, 22 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు కృషి విజ్ఞాన సంస్థ వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఇదిలావుంటే ఉదయం 6 నుంచి ఆదిలాబాద్, ఉట్నూరు ఏజెన్సీని మంచుదుప్పటి కమ్మేయడంతో జిల్లా పరిస్థితి మరో కాశ్మీరాన్ని తలపిస్తోంది. ఉత్తరాదిన వారం రోజులుగా వీస్తున్న చలిగాలుల ప్రభావంగానే ఉష్ణోగ్రతలు కనిష్ఠస్థాయికి చేరుకుంటున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. చలితీవ్రతతో వృద్దులు, పిల్లలు, యాచకుల పరిస్థితి జిల్లాలో దయనీయంగా మారింది. ** చలికాగుతున్న పల్లెజనం **