కరీంనగర్

వామ్మో.. చలి‘పులి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* చలి మంటలు కాగుతున్న యువతరం
* ముసుగుల్లోనే పిల్లలు, వృద్ధులు
జగిత్యాల, డిసెంబర్ 27: వామ్మో.. చలి‘పులి’ పంజా దెబ్బకు తట్టుకోలేక పోతున్నారు. ఆరు దాటిందంటే అందరూ ఇండ్లకే పరిమితమవుతున్నారు. చలిపంజా తట్టుకునేందుకు మంటలు ముందు యువకులు చలి కాగుతున్నారు. గత 4రోజుల నుండి 8డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో పిల్లలు, వృద్ధులు చలిని తట్టుకోలేక వామ్మో చలి.. అని ముసుగేసుకొని పడుకుంటున్నారు. చలి తీవ్రతను తట్టుకునేందుకు స్వెటర్లు, మంకీ క్యాప్‌లు ధరించినప్పటికీ చలిని తట్టుకోలేని కొందరు ఉదయం పూట పనులు పక్కన పెడుతూ వాయిదా వేసుకుంటున్నారు. రైతులకు రాత్రివేళల్లో చలి‘పులి’ని లెక్కచేయకుండా వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. రాత్రి 7గంటల తర్వాత, ఉదయం 7 గంటల వరకు రోడ్లు నిర్మాణుష్యంగా మారిపోతున్నాయి. ఒక వేళ యువకులు ఇంటి నుండి బయటకు వచ్చినా ఏదో ఒక చోట చలి మంటలు కాచుకునేందుకు గుమిగూడుతున్నారు. కాగా, పిల్లలు, వృద్ధులు ఇంటి నుండి బయటకు రాలేకపోతున్నారు. రానున్న మరో నాలుగైదు రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని శాస్తవ్రేత్తలు వెల్లడిస్తున్న నేపథ్యంలో వామ్మో చలిపులి తట్టుకునేదెలా అంటూ భయంతో జనం వణికిపోతున్నారు.