కరీంనగర్

4న చలో కలెక్టరేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకరంపుర, జనవరి 1: రిక్షా కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 4న చలో కలెక్టరేట్ కార్యక్రమం ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు ఎఐటియుసి జిల్లా కార్యదర్శి కాలువ నర్సయ్య యాదవ్ తెలిపారు. శుక్రవారం స్థానిక గంజి ప్రాంతంలో స్థానిక రిక్షా అడ్డా వద్ద పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. రిక్షా కార్మికులు కూలీ పని దొరకక సతమతమవుతున్నారని, ఇల్లు గడవని పరిస్థితి నెలకొందని వాపోయారు. ఇప్పటికీ నగరంలో రిక్షా అడ్డాలు లేవని, ట్రాఫిక్ పోలీసులు అడ్డాలు చూపించని మూలంగా రిక్షా కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. రిక్షా కార్మికులందరికి ప్రభుత్వం ఉచితంగా రిక్షాలు ఇవ్వాలని, 50 సంవత్సరాలు దాటిన రిక్షా కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిక్షా కార్మికుల కూలీ రేట్లను యజమానులు పెంచి వారికి చేదోడువాదోడుగా ఉండాలన్నారు. ఈ కరపత్ర ఆవిష్కరణలో సిపిఐ నగర కార్యదర్శి పైడిపల్లి రాజు, రిక్షా యూనియన్ అధ్యక్షులు జంగ చంద్రయ్య, కార్యదర్శి బుచ్చన్న, భీముడు, వీరయ్య, చంద్రు, హరి,రాములు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

‘జమాతే’ సేవలు అభినందనీయం
సిఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి
జగిత్యాల, జనవరి 1: జమాతే ఇస్లామి హిందూ సామాజిక సేవలు అభినందనీయం అని సిఎల్పీ ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక జెండా మైల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఆపదలో ఉన్న కుటుంబాలకు ఉచితంగా అంబులెన్స్ సేవలు జమాతే ఇస్లామి హిందూ అందించడం ప్రశంసించదగినవన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ శశాంక మాట్లాడుతూ కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చానని రానున్న రోజుల్లో జమాతే సామాజిక సేవలకు తమ సహకారాన్ని అందిస్తామని వెల్లడించారు. డిఎస్పీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు అన్ని కుల, మతాలను కలుపుకొని సామాజిక సేవలు అందించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామి హిందూ రాష్ట్ర కార్యదర్శి అబ్ధుల్ హజీజ్, జగిత్యాల అధ్యక్షులు సోయాబుల్ హక్, నయిమొద్దీన్, ముదుసరీ, మున్సిపల్ వైస్ చైర్మన్ మన్సూర్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

దళితులకు భూమి ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం
* సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కర్రె భిక్షపతి
ఎల్కతుర్తి, జనవరి 1: దళితులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు ఎకరాల భూమి ఇవ్వడంలో కెసిఆర్ ప్రభుత్వం విఫలం చెందిందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కర్రె భిక్షపతి అన్నారు. శుక్రవారం ఎల్కతుర్తి మండలం వీరనారయణపూర్ గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించి ఈ సందర్భంగా కర్రె భిక్షపతి మాట్లాడుతూ దళితులకు మూడు ఎకరాలు భూమి ఇవ్వని కెసిఆర్ వివిధ పథకాల పేరుతో కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేస్తున్నారని, రెండు సంవత్సరాల నుండి కరవు కాటకాలతో రైతన్నలు అల్లాడుతున్నా జిల్లాలోని కొన్ని మండలాలనే కరవు ప్రాంతాలుగా ప్రకటించారని, కరీంనగర్ జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించి రైతులు తీసుకున్న రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రమణ, రాజు, రంగారావు, ఆనందం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

గోపాల మిత్రుల ధర్నా
ముకరంపుర , జనవరి 1: పశుగణాభివృద్ధి సంస్థలో 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న గోపాల మిత్రులందరు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా వచ్చి నినాదాలు చేస్తూ తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతామని హెచ్చరించారు. గోపాలమిత్రులకు వేతనం నెలకు 16,500 రూపాయలు చెల్లించాలని, ఇన్సూరెన్స్ కల్పించాలని, రేపటి నుండి కలెక్టరేట్ ఎదుట దీక్షా కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.

స్తంభం పైనుండి పడి యువకుడి మృతి
రాయికల్, జనవరి 1: మండలంలోని చర్లకొండాపూర్ శివారుల్లో విద్యుత్ స్తంభంపై నుండి పడి శుక్రవారం అస్రాఫుల్ (20) అనే యువకుడు మృతి చెందాడు. రామగుండం నుండి నిర్మల్ వరకు 220 కె.వి.విద్యుత్ లైన్ నిర్మాణపు పనులు జరుగుతున్నాయి. ఇందులో పశ్ఛిమబెంగాల్‌కు చెందిన కార్మికులు పనులు చేస్తున్నారు. ఇదే క్రమంలో మరమ్మతు చేసి స్తంభం నుండి దిగుతుండగా కాలు జారి అస్రాఫుల్ కిందపడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్సనిమిత్తం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. శవాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.