బిజినెస్

రాజధాని నిర్మాణంలో అన్ని విధాలుగా సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రబాబును కలిసిన విజయా బ్యాంక్ ఎండి
విజయవాడ, నవంబర్ 24: రాజధాని నిర్మాణంలో విజయా బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించగలదంటూ విజయా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ కిషోర్ శ్యాంసింగ్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి తెలియజేశారు. రాజధానిలో ఏర్పాటుకానున్న పరిశ్రమల నిర్మాణానికి కూడా సహకరించగలమన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 1,780 శాఖలతో అలాగే ఉభయ రాష్ట్రాల్లో 305కుపైగా డెలివరీ ఛానల్స్‌తో విస్తరించిన విజయాబ్యాంక్ దేశవ్యాప్తంగా గత సెప్టెంబర్ మాసాంతానికి 2.10 లక్షల కోట్ల వ్యాపారంతో ముందుకు సాగుతోందన్నారు. విజయవాడ రీజియన్‌లో ప్రస్తుత వ్యాపారం రూ. 6 వేల కోట్లకు చేరువగా ఉందని, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, టెలి బ్యాంకింగ్, ఈ పాస్‌బుక్ వంటి పథకాలతో దేశమంతా విస్తరించామన్నారు. ముద్ర పథకంలో భాగంగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో అర్హులైనవారికి రూ. 900 కోట్లకు పైగా రుణ వితరణ చేయటం జరిగిందన్నారు.
సిఎంతో పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఎండి భేటి
పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ అమితాబ్ కూడా మంగళవారం చంద్రబాబు నాయుడితో భేటి అయ్యారు. విద్యుత్ సరఫరాలో సాంకేతిక, వాణిజ్య నష్టాలు (టి అండ్ సి) తగ్గించే విధంగా తమ సంస్థ సహకారం అందిస్తుందని ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ఏడాది లోనే మిగులు విద్యుదుత్పత్తితో రాష్ట్రం ముందడుగేసిందని, విద్యుత్ నిర్వహణ, విద్యుత్ వాణిజ్యంలో సమస్యలకు పరిష్కారాలు సూచిస్తామన్నారు.