రాష్ట్రీయం

హృద్రోగ చిన్నారులకు ఉచిత శస్త్ర చికిత్సలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముందుకు వచ్చిన బ్రిటన్ బృందం
ఏపి సిఎం చంద్రబాబుతో భేటీ
తిరుపతి, విజయవాడ, విశాఖలో పిడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రులు
వైద్య బృందాన్ని కోరిన ముఖ్యమంత్రి

విజయవాడ, డిసెంబర్ 4: రాష్ట్రంలో విజయవాడ, విశాఖ, తిరుపతిలో పిడియాట్రిక్ కార్డియాక్ శస్త్ర చికిత్స ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం తనను కలిసిన బ్రిటన్ శిశు హృద్రోగ శస్త్ర చికిత్స వైద్య బృందానికి ప్రతిపాదించారు. ఆస్పత్రులు ఏర్పాటు చేస్తే అన్ని విధాల తాము సహకరిస్తామని ఆయన తెలియజేశారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవాభావంతో శిశువులు, చిన్నారులకు హృద్రోగ శస్త్ర చికిత్సలు చేస్తామని ముందుకు వచ్చిన వైద్య నిపుణులను ఆయన అభినందించారు.
రాష్ట్రంలో తాము శిశు వైద్య రంగాన్ని మెరుగు పర్చుకుంటున్నామని, మరోవైపు మాతా, శిశు మరణాలను సింగిల్ డిజిట్‌కు తీసుకుళ్లేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని వివరించారు. శిశువులు, చిన్నారులకు శస్త్ర చికిత్సలు ఎంతో క్లిష్టమైనవన్నారు. బ్రిటన్ బృంద ప్రతినిధులు మాట్లాడుతూ తాము పిడియాట్రిక్ కార్డియాక్ సమస్యలకు శస్త్ర చికిత్సలు అందిస్తామని, ఉచితంగా సేవలందించటానికి భారత్‌ను ఎంచుకున్నామని, ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారులకు హృదయ సంబంధ సమస్యలు ఎక్కువగా నమోదవుతున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని చెప్పారు. ఇండియాలో ఇప్పటికే సినీ హీరోయిన్ సమంత నెలకొల్పిన ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. అయితే తాము పరిమితంగా కాకుండా విస్తృతంగా సేవలు అందించదలిచామని సిఎంకు వివరించినప్పుడు ఆయన విశాఖ, విజయవాడ, తిరుపతిలో పిడియాట్రిక్ కార్డియాక్ విభాగాలను నెలకొల్పవలసిందిగా ప్రతిపాదించారు. ఇందుకు అన్ని విధాల సహకరిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, యుకె పిడియాట్రిక్ కార్డియాక్ వైద్యులు డా.్ఫల్ ఆర్నాల్డ్, డా.జోహా మహ్మద్, డా.నైనా హాల్, డా.్ఫల్‌నైట్, డా.్ఫయోనా ఉడ్, డా.మారియా ఎన్-తాలా, డా.గైడో ఒప్పిడో, డాక్టర్ విక్రం కుడుమల, డా.రమణ దన్నపునేని, డా.సంజీవ్ నిచాని, డా.లెస్లీ మిస్ర్తి ఉన్నారు. ఎపి మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ డా.వై.రాజారావు, ఆంధ్ర హాస్పిటల్స్ ఎండి డా.పివి రమణమూర్తి, చీఫ్ ఆఫ్ కార్డియాక్ సర్జరీస్ డా.పివి రామారావు తదితరులు సిఎంను కలిశారు. (చిత్రం) శుక్రవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన బ్రిటన్ వైద్యులు