రాష్ట్రీయం

కాంగ్రెస్ హయాంలోని అవినీతిపై ప్రత్యేక న్యాయస్థానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం జిల్లా జన చైతన్యయాత్రలో చంద్రబాబు

విజయనగరం, డిసెంబర్ 7: పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కొందరు ఆ పార్టీ నాయకులు ప్రజాధనాన్ని అప్పనంగా మింగేశారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. ప్రజాధనం దుర్వినియోగంపై ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని, దిగమింగిన ప్రజల డబ్బును రికవరీ చేసి ప్రజాసంక్షేమానికి ఉపయోగిస్తామని చెప్పారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని లక్కవరపుకోటలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన చైతన్యయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని బిసి కాలనీలో చంద్రబాబు కొద్దిసేపు పాదయాత్ర జరిపి అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం అమరావతి ప్రాంత రైతులు తనపై నమ్మకం ఉంచి 35వేల ఎకరాలు ఇచ్చారని, ఆ ప్రాంత రైతులకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తనదని అన్నారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నామని, ఈ నిర్మాణానికి అవసరమైన భూములను తనపై నమ్మకం ఉంచి ఇవ్వాలని రైతులను కోరారు. అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రతిపాదించిన భావనపాడు నౌకాశ్రయం నిర్మాణానికి అక్కడి రైతులు సహకరించాలని అన్నారు. ఈ నిర్మాణాలు పూర్తయితే ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. వ్యవసాయంతోపాటు వ్యవసాయ ఆధార పరిశ్రమలు, ఇతర పరిశ్రమలు అభివృద్ధి చెందవలసిన అవసరం ఉందని అన్నారు. రాష్టవ్రిభజన అడ్డుగోలుగా, అసమంజసంగా జరిగిందన్నారు. దీనికి ప్రధాన బాధ్యత అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీదంటూ, ఇప్పుడు అదే పార్టీ నేతలు.. టిడిపి ప్రభుత్వం చేపడతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విమర్శలు చేయటం సిగ్గుచేటని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని దోచుకున్న నేతలు కొందరు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరి తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు ఉత్తరాంధ్రకు చెందిన కొందరు బడా నాయకులు ఇక్కడి ప్రజలు పేదలుగా ఉంటేనే తమ రాజకీయ మనుగడ కొనసాగుతుందనే ధోరణితో వ్యవహరించారని అన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో టిడిపి కార్యకర్తలు అష్టకష్టాలు అనుభవించారని, అయినా మొక్కవోని ధైర్యంతో పార్టీలో కొనసాగుతూ మళ్లీ పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేశారన్నారు. కార్యకర్తల కృషితో పదవులు అనుభవిస్తున్న నాయకులు కార్యకర్తలను ఎప్పటికీ మరచిపోరాదని సూచించారు.
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో ప్రజల సమస్యలకు తాత్కాలిక ఉపశమనం, తాత్కాలిక ప్రయోజనం లభించవచ్చని, కానీ ఇవి శాశ్వత పరిష్కారం కాదని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేసారు. దీనిని దృష్టిలో పెట్టుకునే తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు ముమ్మర చర్యలు చేపట్టిందని అన్నారు. రాజధాని లేకుండా, ఆదాయ వనరులు లేకుండా, అవసరమైన విద్యాసంస్థలు, పరిశ్రమలు లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని, అయినా కూడా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా 18నెలల కాలంలో సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నానని చెప్పారు. విద్యారంగంలో మెరుగైన అవకాశాలు పెంచవలసిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, రాష్టమ్రంత్రులు కిమిడి మృణాళిని, అచ్చెంనాయుడు, పల్లె రఘునాథరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీష్, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.