నటిస్తూ... చదువుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నూతన హీరో చరణ్‌తేజ్
సంపూర్ణేష్‌బాబు, చరణ్‌తేజ్, హమీదా ముఖ్యపాత్రల్లో రాజేష్ పులి దర్శకత్వంలో మారుతి టీమ్ వర్క్స్ పతాకంపై రూపొందుతోన్న చిత్రం ‘్భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ’. ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న చరణ్‌తేజ్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో చరణ్‌తేజ్ తన గురించి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
‘మాది గుంటూరు జిల్లా. పెరిగింది అంతా రాజమండ్రిలో. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎంబిబిఎస్ మూడో సంవత్సరం చదువుతున్నా. చిన్నప్పటినుంచీ సినిమాలపై ఆసక్తి వుండేది. దాంతో చదువుకుంటూనే మరోవైపు సినిమాలు ట్రై చేద్దామని సహాయ దర్శకునిగా కెరీర్ ప్రారంభించా. మారుతి, త్రినాథరావు నక్కిన దగ్గర పనిచేశా. మారుతితో చాలా రోజులుగా ట్రావెల్ అవుతున్న సందర్భంగా దర్శకత్వం కాకుండా నటనపై ఆసక్తి పెట్టు అని చెప్పారు. అలా ఈ సినిమాలో నన్ను ముఖ్యపాత్రకు ఎన్నుకున్నారు. ఇందులో నేను షార్ట్ఫిలిం మేకర్‌గా కనిపిస్తా. అందమైన అమ్మాయిని చూసి ప్రేమలో పడతా. ఆమె బాగా డబ్బున్న అమ్మాయి. మా పెళ్లికి జనరల్‌గా వచ్చే అడ్డంకులే ఈ సినిమాలో కూడా వస్తాయి. ఆమెను పెళ్లిచేసుకోవాలంటే కోటి రూపాయలు సంపాదించమని మామ కండిషన్ పెడతాడు. తరువాత ఏం జరిగిందన్నదే కథ. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగుతుంది. సంపూర్ణేష్‌బాబుతో పనిచేయడం ఆనందంగా వుంది. అలాగే నాకు సపోర్టు అందిస్తున్న వినాయక్, పరుచూరి వెంకటేశ్వరరాలకు ధన్యవాదాలు. ప్రస్తుతం మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతున్నా. చదువుతో పాటు యాక్టింగ్ కంటిన్యూ చేస్తా’ అని ముగించారు.