జాతీయ వార్తలు

షీనా ఖాతానుంచి మెయిల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూతురు బతికే ఉందని నమ్మించడానికి ఇంద్రాణి ఎత్తుగడ * సిబిఐ చార్జిషీట్‌లో వెల్లడి
ముంబయి, నవంబర్ 22: తన కుమార్తె షీనా బోరాను హత్య చేసిన దాదాపు ఏడాది తర్వాత కూడా ఇంద్రాణి ముఖర్జీ తాను షీనా బోరాకు తల్లిని కానీ, సోదరిని కానీ కాదని తన భర్త పీటర్‌ను నమ్మించడానికి ప్రయత్నించింది. షీనా బోరా హత్యకు సంబంధించి గత వారం అరెస్టు చేసిన పీటర్‌కు షీనా అకౌంట్‌నుంచి పంపించిన ఒక ఇ-మెయిల్‌లో ఈ విషయం పేర్కొన్నట్లు ఈ కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో పేర్కొన్నారు. షీనా బోరా బతికే ఉందని జనాన్ని నమ్మించడానికి ఇంద్రాణి చాలామందికి పంపించిన ఇ-మెయిల్స్‌లో ఇదొకటని గత గురువారం సిబిఐ దాఖలు చేసిన చార్జిషీటులో పేర్కొన్నట్లు సిబిఐ వర్గాలు తెలిపాయి. ‘ఇది నీకు చాలా విపరీతంగా అనిపించవచ్చు కానీ ఇది మాత్రమే అసలు నిజం. ఇంద్రాణి నాకు తల్లి కానీ, సోదరి కానీ కాదు. కేవలం కొన్ని సంవత్సరాల క్రితం మన జీవితాల్లోకి వచ్చిన ఓ అపరిచిత వ్యక్తి మాత్రమే’నని 2013 మార్చి 14న పీటర్‌కు పంపిన ఇ-మెయిల్‌లో ఉంది. ఈ విషయమై ఇంద్రాణి లాయరు గుంజన్ మంగ్లాను కాటాక్ట్ చేయడానికి వీలు కాలేదు కానీ, ఆమె మాజీ భర్త, ఈ కేసులో మరో నిందితుడైన సంజీవ్ ఖన్నా లాయరు శ్రేయంశు మిథారే మాత్రం తాను ఇంకా చార్జిషీట్ చూడలేదని చెప్పారు. ‘నేను ఇంకా చార్జిషీట్‌ను పరిశీలించలేదు. అందువల్ల దీనిపై ఎలాంటి వ్యాఖ్య చేయలేను’ అని ఆయన పిటిఐతో అన్నారు. తాను ఆ మెయిల్‌ను చూడలేదని, అందువల్ల ఎలాంటి వ్యాఖ్య చేయనని పీటర్ తరఫు లాయరు నిరంజన్ ముండెర్గి కూడా చెప్పారు. తన తాత, అమ్మమ్మలకు ఒక కూతురు ఉందని ఆమె పేరు కూడా ఇంద్రాణేనని షీనా అకౌంట్‌నుంచి ఇంద్రాణి పంపించిన ఆ ఇ-మెయిల్‌లో ఉంది. తన తల్లి ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆ వ్యక్తితో తన తల్లి లేచిపోయిందని అతని ద్వారా షీనా బోరా, మిఖైల్ అనే ఇద్దరు పిల్లలు కలిగారని ఆ ఇ-మెయిల్‌లో ఉంది. తమ సొంత కాళ్లపై నిలబడడానికి దాదాపు రెండేళ్లపాటు నానాకష్టాలు పడ్డ తర్వాత అలా గడపడం సాధ్యం కాదని గ్రహించిన వాళ్లు తిరిగి ఇంటికి వచ్చారని, అప్పుడు తన తల్లి మిఖైల్‌ను కడుపుతో ఉందని కూడా ఆ ఇ-మెయిల్‌లో ఉంది. షీనా తండ్రి తక్కువ కులానికి చెందినవాడే కాక, ఆర్థికంగా కూడా అంత ఉన్న కుటుంబానికి చెందినవాడు కాదని, అందువల్లనే తన తాత, అమ్మమ్మలకు వారి సంబంధం ఇష్టం లేదని కూడా ఆ ఇ-మెయిల్‌లో ఉంది. (చిత్రం) ఇంద్రాణి ముఖర్జీ