తెలంగాణ

తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ చార్జీల మోత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ చార్జీలను పెంచేందుకు రంగం సిద్ధమైంది. చార్జీల పెంపుదల విషయమై సిఎం కెసిఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అధికారులు పలు ప్రతిపాదనలు రూపొందించారు. కెసిఆర్‌ను బుధవారం మధ్యాహ్నం ఆర్టీసీ, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు కలిసి నివేదికలను సమర్పించారు. సామాన్యులకు భారం కాకుండా చార్జీలు పెంచాలని సిఎం ఆదేశించడంతో అందుకు తగ్గట్టుగా అధికారులు ప్రతిపాదనలను రూపొందించారని తెలిసింది. ఆ ప్రతిపాదనలను సిఎం ఆమోదిస్తే గనుక పెంచిన చార్జీలు గురువారం నుంచే అమలులోకి వచ్చే అవకాశం ఉంది. వంద యూనిట్లకు పైబడి విద్యుత్ చార్జీలు పెంచవచ్చని, ఆర్టీసీలో పెంపుదల పదిశాతానికి మించి ఉండదని సమాచారం. గ్రామీణ ప్రాంతాలకు నడిచే పల్లెవెలుగు బస్సు చార్జీలను అంతగా పెంచరాదని ప్రభుత్వం భావిస్తోంది.