రుచి

చేమాకు వంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకుకూరలు ప్రతిరోజూ 100 నుంచి 150 గ్రాముల వరకూ తీసుకుంటే శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. మనం నిత్యం వాడే తోటకూర, గోంగూర, మెంతికూర, చుక్కకూర వంటివే కాకుండా చామాకు, వామాకు, పొన్నగంటి ఆకు, గంగావాయి కూర, సిలోన్ బచ్చలి వంటివి కూడా అప్పుడప్పుడైనా వంటల్లో వాడితే రుచితో పాటు మంచి పోషకాలూ అందుతాయి. విభిన్నమైన ఈ ఆకుకూరలు మార్కెట్లో అంతగా లభించవు. ప్రత్యేకంగా గ్రామాలకు వెళ్లి వీటిని తీసుకురావాల్సి ఉంటుంది. గంగవాయి, పొన్నగంటి, అవిశ ఆకులతో పప్పుకూర, పచ్చడి, పులుసు వంటివి చేస్తారు. చేమాకులతో చేసే పొట్లాల కూర, పకోడీలు, వడకర్రీ, శెనగపప్పుకూర, మంచూరియా వంటివి ఎంతో రుచికరంగా ఉంటాయి.

పొట్లాల కూర
కత్తిరించిన చేమాకులు - 12
పెసరపప్పు - 1 కప్పు
అల్లం,వెల్లుల్లి ముద్ద - 4 చెంచాలు
జీలకఱ్ఱ - 1 చెంచా
నూనె - 250 గ్రా.
పచ్చిమిర్చి - 4
నువ్వుల పొడి - 2 చెంచాలు
ఉప్పు -1 చెంచా
మసాలా కారం - 2 చెంచాలు
నిమ్మరసం - 5 చెంచాలు

నాలుగైదు గంటల సేపు నానబెట్టిన పెసరపప్పులో నుంచి నీటిని పూర్తిగా తీసివేసి, అందులో ఉప్పు,పచ్చిమిర్చి ముక్క లు, జీలకఱ్ఱ పొడి, అల్లం-వెల్లుల్లి ముద్ద, నువ్వుల పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన చేమాకుల్లో ఉంచి అంచులను మూసివేయాలి. పెసరపప్పు మిశ్రమాన్ని కూరిన ఈ చేమాకు పొట్లాలను ఇడ్లీ స్టాండ్‌లో పెట్టి ఆవిరిపై ఉడికించాలి. చల్లారిన తర్వాత ఈ పొట్లాలను విప్పి రెండు ముక్కలుగా చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి వీటిని దోరగా వేపాలి. చివరగా ఈ ముక్కలపై జీలకఱ్ఱ కారం, మసాలా కారం, నిమ్మరసం జల్లి సర్వ్ చేయాలి.

వడకర్రీ
బొబ్బర్ల పప్పు - 1 కప్పు
తరిగిన చేమాకులు - 4 కప్పులు
నూనె - 250 గ్రా
పచ్చిమిర్చి - 6
జీలకఱ్ఱ -1 చెంచా
ఆవాలు - 1 చెంచా
ఉల్లిముక్కలు - 1 కప్పు
కొబ్బరి కోరు - 1 కప్పు
కొత్తిమీర - కొంచెం
టమాటాలు - 4
ఉప్పు - 2 చెంచాలు
అల్లం - చిన్న ముక్క

ముందుగా కొబ్బరి కోరు, ఉల్లి ముక్కలు, టమాటాలు, కొత్తిమీర మిక్సీ పట్టి గ్రేవీ తయారుచేసుకోవాలి. నానబెట్టిన బొబ్బర్ల పప్పులో చేమాకుల తరుగు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మిక్సీ పట్టి వడలుగా చేసుకోవాలి. బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకఱ్ఱ వేయించి ఆ తర్వాత కొబ్బరి, ఉల్లి, టమాటా, కొత్తిమీర మిశ్రమాన్ని ఉడికించాలి. ఇది బాగా ఉడికాక చేమాకు వడలు వేయాలి. వడలు కూడా మెత్తగా ఉడికిన తర్వాత కిందకు దింపేయాలి.

శెనగపప్పుతో..

చేమాకు తరుగు - 2 కప్పులు
కొబ్బరి కోరు - 1 కప్పు
శెనగపప్పు - 1 కప్పు
నూనె - 2 చెంచాలు
ఎండుమిర్చి - 2
ఆవాలు,
జీలకఱ్ఱ - 2 చెంచాలు
ఉప్పు - 1 చెంచా
కరివేపాకు- కొంచెం

చేమాకు తరుగు, శెనగపప్పులో ఉప్పువేసి మెత్తగా ఉడికించాలి. బాణలిలో నూనె వేడిచేసి ఆవాలు, జీలకఱ్ఱ, ఎండుమిర్చి, కరివేపాకు, కొబ్బరి కోరు వేయించాక, ఇందులో ఉడకబెట్టిన శెనగపప్పు, చేమాకు మిశ్రమాన్ని కలపాలి. నీరంతా ఇంకిపోయేలా ఉడికితే ఈ కూర పొడిపొడిగా వస్తుంది.

మంచూరియా
చేమాకు తరుగు - 2 కప్పులు
శెనగపిండి - 1 కప్పు
బియ్యప్పిండి- 1/2 కప్పు
కారం - 2 చెంచాలు
నూనె - 250 గ్రా.
జీలకఱ్ఱ - 2 చెంచాలు
జీడిపప్పు - 24
కరివేపాకు - కొంచెం
కొబ్బరి కోరు- 2 చెంచాలు
చిల్లీసాస్ - 2 చెంచాలు

తరిగిన చేమాకు, బియ్యప్పిండి, శెనగపిండి, జీలకర్ర, ఉప్పు, కారం, కొబ్బరి కోరు,కరివేపాకు కలిపి పకోడీ ముద్దలా చేసుకోవాలి. వీటిని బాగా మరగిన నూనెలో దోరగా వేపాలి. ఆ తర్వాత ఈ పకోడీలపై వేయించిన జీడిపప్పు ముక్కలు, చిల్లీసాస్ వేసి ఐదు నిమిషాల సేపు బాణలిలో మగ్గనిచ్చి తియ్యాలి. ఇష్టముంటే వేయించిన ఉల్లిముక్కలను ఈ పకోడీలపై వేసుకోవచ్చు.

-చంద్రిక