క్రీడాభూమి

చెమటోడ్చిన జొకోవిచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 24: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ చెమటోడ్చి క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. 14వ సీడ్ గిలెస్ సిమోన్‌తో తలపడిన ఈ ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు 6-3, 7-6, 6-4, 4-6, 6-3 ఆధిక్యంతో విజయం సాధించాడు. మొదటి మూడు రౌండ్లలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలుస్తూ వచ్చిన జొకోవిచ్ నాలుగో రౌండ్‌లో ఎవరూ ఊహించని విధంగా తడబడ్డాడు. మొదటి సెట్‌ను గెల్చుకున్న అతను రెండో సెట్‌లో ఎంతగా పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. మూడో సెట్‌లో ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని కొనసాగించిన జొకోవిచ్ నాలుగో సెట్‌లో పేలవమైన ఆటతో పరాజయాన్ని కొనితెచ్చుకున్నాడు. దీనితో చివరిదైన ఐదో సెట్ అత్యంత కీలకంగామారింది. సిమోన్‌తో అమీతుమీ తేల్చుకోవాలన్న పట్టుదలతో ఉన్న జొకోవిచ్ చివరి సెట్‌ను తన ఖాతాలో వేసుకొని, టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేశాడు. ఆరో సీడ్ థామస్ బెర్డిజ్ కూడా ఐదు సెట్ల పోరులో రాబర్టో బటిస్టా అగుట్‌ను 4-6, 6-4, 6-3, 1-6, 6-3 తేడాతో ఓడించాడు. సంచలన విజయాలకు మారుపేరైన తొమ్మిదో సీడ్ జో విల్‌ఫ్రైడ్ సొంగాపై జపాన్‌కు చెందిన ఏడో సీడ్ కెయ్ నిషికోరి 6-4, 6-2, 6-4 తేడాతో విజయం సాధించాడు. ప్రపంచ మూడో ర్యాంక్ ఆటగాడు రోజర్ ఫెదరర్ 6-2, 6-1, 6-4 ఆధిక్యంతో డేవిడ్ గోఫిన్‌పై గెలుపొందాడు.