శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఘనంగా చెంగాళమ్మకు పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జనవరి 1: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చెంగాళమ్మ అమ్మవారు శుక్రవారం స్వర్ణ శోభిత స్వర్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామునుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ఇఓ శ్రీనివాసులురెడ్డి భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లుచేశారు. భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుచేసి తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. అమ్మవారిని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, జడ్పీ ఫ్లోర్‌లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి, మాజీ చెంగాళమ్మ ట్రస్టు బోర్డు చైర్మన్ ఇసనాక హర్షవర్ధనరెడ్డి, తదితర ప్రముఖులు దర్శించుకున్నారు.
ఆలయ మర్యాదలతో స్వాగతించి దర్శన అనంతరం ఇఓ తీర్థప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా పట్టణంలోని బాలాంజనేయస్వామి, వెంకట రామ్మూర్తి ఆలయంలో, వెంకటేశ్వరస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.