జాతీయ వార్తలు

చెన్నై నగర శివారు ప్రాంతాలు జలమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని నదులు ఉప్పొంగుతున్నాయి. చెన్నై నగరంతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెంబారంబాకమ్ చెరువు ప్రమాదస్థాయికి చేరడంతో చెరువు నుంచి 30 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి విడుదల కారణంగా నగర శివారు ప్రాంతాలు జలమయమైయ్యాయి. టి.నగర్, మాంబలం, కేకే నగర్, అశోక్‌నగర్, ఈకాడ్‌తాంగల్ వరద ఉధృతికి గురయ్యాయి.అడయార్, కూవం నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సైదాపేట వద్ద నీట అడయార్ నది పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో పలు ప్రాంతాలు నీటమునిగాయి. తిరువళ్లురు జిల్లాలో కుసస్థలి, అరణి నదులు పొంగి పొర్లుతున్నాయి.