అవీ .. ఇవీ..

చిరుత..చిన్నారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ చిత్రంలో చిరుత పక్కనే ఉన్న చిన్నారిని చూస్తున్నారుకదూ...అదేంటి భయంకరమైన ఈ మృగం ఆ పిల్లడ్ని ఏమీ చేయకుండా వెళిపోతోందనుకోవచ్చు. అంత అనుమానం అక్కర్లేదులెండి. ఎందుకంటే ఆ చిరుత అద్దాలగదిలో బంధించబడి ఉంది. అద్దం ఇవతలనుంచి ఆ చిన్నారి చిరుతను చూస్తున్నాడు. ఈ ఫొటోను జాగ్రత్తగా గమనిస్తే వారిమధ్య అద్దాలగోడ ఉన్నట్లు స్పష్టమవుతుంది. బెల్జియంలోని ప్లన్‌కాండల్స్ జూలో ఈ దృశ్యం కన్పించింది.
ఇదో రకం షో
అందమైన దుస్తులతో, అందచందాలతో క్యాట్‌వాక్ చేసే తారలను చూడాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. అయితే వారిని చూడ్డానికి కూడా విభిన్నంగా రావడం ఓ విశేషమే. పోర్చుగల్‌లో జరిగిన ఓ ఫ్యాషన్ షోకు ఈ విజిటర్ ఎలా వచ్చాడో చూడండి మరి. నిజానికి ఈ షోలో ఇతడే అందరి దృష్టినీ ఆకర్షించాడు.
బబుల్ బంప్ సాకర్
కేవలం ఫుట్‌బాల్‌తో ఆడితే ఏముంది మజా అంటున్నారు ఈ క్రీడాకారులు. బబుల్‌లో ఉండి ఫుట్‌బాల్ ఆడితే అందులో ఉండే కిక్ వేరంటున్నారు. చెరో ఐదుమంది క్రీడాకారులతో ఇరుజట్లు ఇలా బబుల్‌బాల్స్‌లో ఉండి ఆడతారన్నమాట. గోల్‌కొట్టేందుకు తలపడితే వారిమధ్య బబుల్‌బాల్స్ అడ్డొస్తూంటాయి. ఒకరినొకరు ఢీకొట్టుకుంటూ, పోటీపడుతూ ఎవరు ఎక్కువ గోల్స్ చేస్తే వారిదే గెలుపు. బాగుందికదూ కొత్తఆట. అన్నట్లు కొలంబియాలో ఈమధ్య ఈ ఆటకు ఆదరణ పెరిగింది.
గాయని.. ఫ్యాషన్ షో
ప్రఖ్యాత పాప్ గాయని మిలె సైరస్ ఈమధ్య కొత్తఅవతారం ఎత్తారు. హిలార్టి ఛారిటీ షోలో ఆమె సొగసైన, విభిన్నమైన దుస్తులతో దర్శనమిచ్చారు. లాస్‌ఎంజిల్స్‌లో జరిగిన ఈ షోలో ఆహూతులను ఆమె అలరించారు.

-భారతి