జాతీయ వార్తలు

చిన్మయానంద కేసును బలహీనపరుస్తున్నారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల నేరారోపణలపై అరెస్టు అయిన చిన్మయానంద కేసును పోలీసులు నీరుగారుస్తున్నారని బాధితురాలు, న్యాయశాస్త్ర విద్యార్థిని ఆరోపించింది. తనపై అత్యాచారానికి పాల్పడి చిన్మయానంద చాలా పెద్ద తప్పు చేశారు. కాని చిన్న శిక్ష విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో తనకు అసంతృప్తిగా ఉందని, సెక్షన్ 376కి బదులు సెక్షన్ 376సి విధించటం సరికాదని ఆమె పేర్కొన్నారు. కాగా న్యాయశాస్త్ర విద్యార్థినిని బ్లాక్‌మెయిల్ చేసి ఏడాదిపాటు అత్యాచారానికి పాల్పడిన చిన్మయానందను శుక్రవారం అరెస్టు చేసి ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మేజస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.