చిత్తూరు

నెత్తురోడిన జాతీయ రహదారి...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదమరి, మార్చి 21: యాదమరి మండల పరిధిలో సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. మండల పరిధిలోని చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిలోని లక్ష్మయ్యకండిగ సమీపంలో సోమవారం వేకువ జామున రెండు గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరోవ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. యాదమరి ఎస్సై రఘుపతి నాయుడు కథనం మేరకు శాంతీపురం మండలానికి చెందిన టిడిపి మండల అధ్యక్షుడు వెంకటమునిరెడ్డి, ఆయన అనుచరుడు మాజీ ఎంపిపి భర్త బాలకృష్ణ, కారు డ్రైవర్ సురేష్, సోగడబల్ల పంచాయతీ సర్పంచ్ గోపాల్‌లు వైఎస్‌ఆర్ కడప జిల్లా రాజంపేటలో జరిగిన ఓ వివాహానికి బొలెరో వాహనంలో వెళ్లారు. కార్యక్రమం ముగించుకొని తిరిగి శాంతీపురానికి పయనమయ్యారు. ఈక్రమంలో చిత్తూరు నగరం దాటుకొని చెన్నై- బెంగళూరు జాతీయ రహదారివైపు వెళ్తుండగా లక్ష్మయ్యకండ్రిగ వద్ద వీరి బొలెరో వాహనాన్ని ఎదురుగా వస్తున్న ఓ లారీ ఢీకొంది. దీంతో బొలెరో వాహనం నుజ్జునుజ్జు అయింది. ఈ వాహనంలో ప్రయాణిస్తున్న వెంకటమునిరెడ్డి(56), మాజీ ఎంపిపి బాలకృష్ణ(42), సురేష్(27) సంఘటన స్థలంలోనే మృతి చెందారు. అదే వాహనంలో ప్రయాణిస్తున్న సర్పంచ్ గోపాల్(38) తల, కాళ్లకు తీవ్ర గాయాలైయ్యాయి. దీంతో స్థానికులు చిత్తూరు పోలీసులకు సమాచారం అందచేసారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను 108వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. గోపాల్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం వేలూరు సిఎంసి ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు ఎస్సై రఘుపతినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే మండలం కుక్కల పల్లి వద్ద సోమవారం సాయంత్రం బాటిల్ ఫ్యాక్టరీలో కార్మికులుగా పని చేస్తున్న చంద్రగిరికి చెందిన రఘు, గుడిపాల మండలంలోని పిళ్లారి కుప్పం గ్రామానికి చెందిన శేఖర్‌లు విధులు ముగించుకొని స్కూటర్‌లో వస్తుండగా, ఎదురుగా వచ్చిన ఇన్నోవా ఢీ కొనడంతో వీరు ఇరువురు మృత్యువాత పడ్డారు. యాదమరి పోలీసుల కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.