సబ్ ఫీచర్

బాలకార్మికుల జీవితాల్లో వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చదువు అంటే వారికి తెలియదు. వారికి తెలిసిందల్లా ఒక్కటే కాయకష్టం చేసి, తమ కుటుంబాన్ని పోషించుకోవడం. ప్రతి రోజు ఉదయానే్న కూలి పనులకు వెళ్ళి, సాయంత్రం ఎప్పుడో తిరిగి రావడం వారి దినచర్య. వారి పిల్లలు రోడ్ల వెంబడి తిరిగి ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త కాగితాలు ఏరుకొని, వాటిని విక్రయించడం ద్వారా వచ్చే డబ్బుతో అల్లరిచిల్లరగా తిరుగుతుంటారు. వారికి పాఠశాల అంటే ఎలా ఉంటుందో, చదువుకోవడం అంటే ఏమిటో తెలియదు. అటువంటి వారు నేడు ఢిల్లీలోని వివిధ కళాశాలలతోపాటు, పలు పాఠశాలల్లో చదువుకొంటున్నారు. దీనికి కారణం ‘‘అన్‌నోటీస్డ్’’అనే స్వచ్ఛంద సేవా సంస్థ.
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థ అయిన జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంకు చెందిన కొందరు విద్యార్థులకు సమాజానికి మేలుచేసే కార్యక్రమం ఒకటి చేపట్టాలని ఆలోచన కలిగింది. వారి ఆలోచనల నుంచి పుట్టుకు వచ్చిందే ‘‘అన్‌నోటీస్డ్’’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ. జె.ఎన్.యు. విద్యార్థులు వారానికి 15 గంటలు చొప్పున ప్రతి రోజు సాయంత్రం తరగతులు నిర్వహిస్తున్నారు. జె.ఎన్.యు.కు సమీపంలో ఉన ఒక మురికివాడలో భవన నిర్మాణ కార్మికులు నివసిస్తారు. ఈ ప్రాంతంలోని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాలని వారు తలంచారు. ప్రతిరోజు సాయంత్రం పిల్లలకు తరగతులు నిర్వహించాలని వారు నిర్ణయించుకొన్నారు. అయితే పిల్లల్ని చదువుకోవడానికి పంపించడానికి వారి తల్లిదండ్రులను ఒప్పించడానికి జె.ఎన్.యు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి వచ్చింది. చదువుకోవడం వలన కలిగే లాభాల గురించి వారు పలుమార్లు ఆ ప్రాంతానికి వెళ్ళి, తల్లిదండ్రులకు వివరించారు. ఎట్టకేలకు భవన నిర్మాణ కార్మికులు తమ పిల్లల్ని సాయంత్రం వేళల్లో తరగతులకు పంపడానికి అంగీకరించారు.
2008లో జె.ఎన్.యు. విద్యార్థులు అన్‌నోటీస్డ్ అనే స్వేచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి, తరగతులు ప్రారంభించారు. పిల్లలకు చదువుతోపాటు వారి అభిరుచులకు అనుగుణంగా డ్యాన్స్, పెయింటింగ్, ఫొటోగ్రఫీ వంటి విషయాలలో కూడా శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. దీంతో పిల్లలు ఈ తరగతుల పట్ల ఆసక్తి చూపడం ప్రారంభించారు. అన్‌నోటీస్డ్ సంస్థలో శిక్షణ పొందిన విద్యార్థులు పలువురు ప్రస్తుతం పలు పాఠశాలలు, కళాశాలల్లోవిద్యనభ్యసిస్తున్నారు. తమవద్ద శిక్షణ పొందిన వారి అభ్యసన సామర్థ్యాలనుబట్టి అన్‌నోటీస్డ్ సభ్యులు సమీపంలో ఉన్న పాఠశాలల్లో చేర్పించారు.
తమ పిల్లలు బరువులుకు బదులుగా పుస్తకాలు పట్టుకొని, ప్రతిరోజు బడికి వెళ్ళడం భవన నిర్మాణ కార్మికుల కళ్ళల ఆనందం తొణకిసలాడుతున్నది. పిల్లలకు తరగతులు నిర్వహించడంతోపాటు, తరచు వైద్య శిబిరాలను ఏర్పాటుచేసేవారు. దీంతో, పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉండటమే కాకుండా, పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత కూడ వారికి తెలిసింది. మొత్తంమీద జె.ఎన్.యు. విద్యార్థుల సేవాభావం ఎందరి జీవితాలలోనో వెలుగులు చిమ్ముతున్నది.
ఆవిధంగా భవన నిర్మాణపు పనుల్లో తల్లిదండ్రులతో పాటు పాల్గొం టున్న బడియాడు పిల్లలు క్రమంగా చదువు పట్ల ఆసక్తిని పెంచుకొని పాఠశాలలకు వెళుతుంటే, నిజంగా అది జెఎన్‌యు విద్యార్ధుల గొప్పతనమేనని చెప్పాలి. చదువుపట్ల ఆసక్తి కలిగించడమే అతికష్టమైన పని. ఒక్కసారి దాన్ని సాధించగలిగితే పిల్లలే తమంట తామే బడిబాట పడతారనడానికి అన్ నోటీస్డ్ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న జెఎన్‌యు విద్యార్థుల కృషే గొప్ప ఉదాహరణ. ఈవిధంగా ఉన్నత చదువులు చదివిన వారు కొంత సమయం నిరుపేద పిల్లలకు పాఠాల బోధనకు కొంత సమ యం కేటాయంచగలిగితే దేశంలో నిరక్షరాస్యతను తేలిగ్గా రూపుమా పవచ్చు.

- పి.మస్తాన్‌రావు