అదిలాబాద్

బాల్య వివాహన్ని అడ్డుకున్న అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూర్, డిసెంబర్ 27: మండలంలోని ద్వారాకపూర్ పంచాయతీ పరిధిలో కాసిపేట గ్రామంలో ఆదివారం ఉదయం రెవెన్యూ, పోలీసు, ఐసిడి ఎస్ అధికారులు బాల్య వివాహన్ని అడ్డుకున్నారు. కాసిపేట గ్రామంలో బాల్య వివాహం జరుగుతుందని సబ్‌కలెక్టర్‌కు సమాచారం వెల్లడంతో ఆయన స్థానిక అధికారులు వెంటనే అక్కడికి వెళ్లాలని ఆదేశించారు. దీంతో డిప్యూటి తహసీల్దార్ సంతోష్, ఆర్ ఐ శ్యామ్‌లాల్, ఎస్సై అశోక్‌కుమార్, ఐసిడి ఎస్ సూపర్‌వైజర్ సిందురాణి కాసిపేట గ్రామానికి వెళ్లారు. బోయపల్లిబోర్డుకు చెందిన అబ్బాయితో కాసిపేట గ్రామానికి మైనర్ బాలికతో వివాహానికి సిద్దమవుతుండగా అధికారులు అడ్డుకున్నారు. బాల్య వివాహం చేయడం నేరమని పేర్కొన్నారు. అనంతర అబ్బాయి, అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులను స్థానిక పోలీసు స్టేషన్‌కు పిలిపించుకొని కౌన్సిలింగ్ నిర్వహించి, అబ్బాయికి, అమ్మాయికి పెళ్ళి చేయబోమని ఒప్పంద పత్రం రాయించుకున్నారు. దీంతో పెళ్లీ ఆగి పోయింది.