శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వణికిస్తున్న చలిగాలులు కమ్మేస్తున్న పొగమంచు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు , డిసెంబర్ 27: జిల్లాలో రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై చలిగాలులు వీస్తుండటంతో నగరవాసులు గజగజ వణికిపోతున్నారు. వాతావరణంలో ఒక్కసారిగా అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. జిల్లావ్యాప్తంగా శని, ఆదివారాలు ఉష్ణోగ్రతలు చాలావరకు తగ్గాయి. వేగవంతంగా చలిగాలులు వీయటంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఆదివారం ఉదయం 11 గంటలైనా మంచుతెరలు కమ్మేయటంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చలి తీవ్రత ఎక్కువ కావటంతో వృద్ధులు, చిన్నారులు గర్భిణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలిగాలుల తీవ్రత వల్ల ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. చలిగాలులతో గుండెజబ్బులు, మధుమేహంతో బాధపడేవారు కండరాల నొప్పులకు లోనవుతారన్నారు. వాతావరణంలో వచ్చిన ఈ అనూహ్య మార్పులు ఇలానే కొనసాగే పరిస్థితులు ఉన్నాయని, చలికి లోనుకాకుండా చలిగాలుల నుండి పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు చేపట్టాలని నిపుణులు అంటున్నారు.