అంతర్జాతీయం

ముగ్గురు చైనా జర్నలిస్టులకు భారత్ దేశ బహిష్కరణ శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: చైనాకు చెందిన అధికార వార్తా సంస్థ 'జిన్హువా' తరఫున పనిచేస్తున్న ముగ్గురు జర్నలిస్టులు జూలై 31వ తేదీలోగా దేశం విడిచిపెట్టాలని ఇండియా ఆదేశించింది. ఢిల్లీలోని 'జిన్హువా' బ్యూరో చీఫ్ వూ క్వియాంగ్, ముంబైలోని రిపోర్టర్లు లూ తాంగ్, షీ యోగ్యాంగ్‌లు నిషేధిత ప్రాంతాలను సందర్శించి అక్కడి సమాచారాన్ని సేకరించడం వంటి పనులు చేస్తున్నారంటూ ఇంటెలిజెన్స్ సంస్థల సమాచారం మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తరహాలో చైనా జర్నలిస్టులకు ఇండియా దేశ బహిష్కరణ శిక్ష విధించడం ఇదే తొలిసారి. ఈ ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల వీసా గడువు ముగిసిపోయింది. జర్నలిస్టుల బహిష్కరణపై చైనా విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు.