రాష్ట్రీయం

ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రాన్ని కోరిన చినరాజప్ప

హైదరాబాద్, డిసెంబర్ 10: కరవు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆపన్న హస్తం అందించి ఆదుకోవాలని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్, వ్యవసాయ శాఖా మంత్రి రాధా మోహన్ సింగ్‌లను చినరాజప్ప కలసి రాష్ట్రంలో కరవు, వరదల వల్ల జరిగిన నష్టంపై నివేదికను అందజేశారు. రాష్ట్రంలో పది జిల్లాల్లో 359 మండలాల్లో తీవ్రమైన కరవు పరిస్థితులు ఏర్పడటం వల్ల దాదాపు 2443 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ నిబంధనల ప్రకారం తక్షణం రాష్ట్రానికి 2001 కోట్ల రూపాయిల ఆర్ధిక సహాయం అందించాలని ఆయన కోరారు. గత నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలతో పాటు అనంతపురం, తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లిందని అన్నారు. వరదల వల్ల రాష్ట్రంలో 3759 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెప్పారు. వ్యవసాయ , ఉద్యానవసన, మత్స్యశాఖలకు 1270 కోట్లు, వౌలిక సదుపాయాలైన రహదార్లు, తాగునీటికి 2293 కోట్లు, పౌరసరఫరాల శాఖకు 104 కోట్లు నష్టం వాటిల్లిందని చినరాజప్ప చెప్పారు. తక్షణం 2195 కోట్ల ఆర్ధిక సహాయాన్ని రాష్ట్రానికి అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వరదల వల్ల జరిగిన నష్టంపై కూడా అంచనా వేసేందుకు త్వరలో కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపుతామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చినట్టు చెప్పారు. కేంద్రపట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఎం వెంకయ్యనాయుడు, లోక్‌సభ సభ్యుడు తోట నర్సింహం, పి రవీంద్రబాబు, కంభంపాటి హరిబాబులు కేంద్ర మంత్రులను కలిసిన వారిలో ఉన్నారు.