అక్షర

చిన్నారుల పెంపకంలో మార్గదర్శి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక కాలంలో పిల్లల పెంపకం
(సమగ్ర మానసిక విశే్లషణ - మార్గదర్శక సూత్రాలు)
-శ్రీవాసవ్య - కెరీర్ స్పెషలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్
పేజీలు : 248, వెల : 100 రూపాయలు
శ్రీ బాలాజీ పబ్లికేషన్స్, నస్రుల్లాఖాన్ వీధి, అరండల్ పేట,
విజయవాడ - 520 002
ఫోన్ నం: 94411 76276

పిల్లలు కల్లాకపటం తెలియనివారు. వారిని చూడగానే మనసుకి హాయనిపించి అప్రయత్నంగా మన పెదవులపై చిర్నవ్వు పూస్తుంది! పిల్లలకి మంచి, చెడు తెలియజేస్తూ పెంచడం రచయిత చెప్పినట్టు కత్తిమీద సామే. గ్రంథ రచన మొదట్లో ‘పిల్లలకు సొంత ఆలోచనలుంటాయి’ అని ఖలీల్ జీబ్రాన్ చెప్పింది కోట్‌చెయ్యటం బాగుంది. జీవ పరిణామంలో తల్లి పాత్ర గురించి రాస్తూ రచయిత.. తల్లిదండ్రులకు కొరుకుడుపడని, అర్థంకాని సమస్య పిల్లల పెంపకమే. అందుకు పరిష్కార మార్గం 0.1 శాతమైనా అందించడానికి ప్రయత్నిస్తానని అన్నారు. అంతకంటే చాలాచాలా ఎక్కువే రాశారు. ఈ గ్రంథం ఇంట్లోవుంటే పెద్ద దిక్కయిన బామ్మ చిట్కాలు తోడున్నట్లే లెక్క!
పూర్వం తల్లి ఇంటివద్దే ఉండి భర్త సంపాదనను జాగ్రత్తగా ఖర్చుపెడుతూ బిడ్డలకి వండిపెడుతూ ఆలనాపాలనా చూసేది. ఇప్పుడలా కాదు. భార్యా భర్తలిద్దరూ ఉద్యోగాలకి వెళ్లాల్సి వస్తోంది. మానసికంగా, శారీరకంగా కష్టం ఎక్కువైంది. పిల్లలతో గడిపే సమయమూ తగ్గిపోయింది. సరదాగా అల్లరి చేసే పిల్లల మీద పని ఒత్తిడి మీద విసుక్కున్నా తరువాత మనసు చివుక్కుమనక మానదు. ఇక ఈ అత్యాధునిక కాలంలో వీడియో గేమ్స్, టీవీలు, ఇంటర్నెట్, ఫేస్ బుక్.. మాయాజాలంలో పడి పిల్లలు కొట్టుకుపోతున్నారు. అయితే వాటిని అర్థవంతంగా ఉపయోగించటం ఎలానో మనం నేర్పాలి.
‘ఆధునిక కాలంలో పిల్లల పెంపకాన్ని’ రచయిత 36 అధ్యాయాలుగా వివరించారు. పొత్తిళ్లలోని బిడ్డకి తల్లిపాలు రోగనిరోధక శక్తినిచ్చే వరం అంటూ మొదలుపెట్టడం బాగుంది. మధ్య వయస్సులో ఎథిరో స్కరోసిస్ వ్యాధి రాకుండా తల్లిపాలు రక్షిస్తాయని సశాస్ర్తియంగా తెలియజెప్పారు. రెండో అధ్యాయంలో చిన్నారుల మనో వికాసం - అమ్మా నాన్నల పాత్ర గురించి పేర్కొన్నారు. పిల్లల పెంపకం ఏడాది వరకూ ఒక ఎత్తయితే.. వాళ్లు తప్పటడుగులు వేయడంతో తల్లిదండ్రుల తిప్పలు మొదలవుతాయి. ఎంత అల్లరి చేసినా చిన్నచిన్న దెబ్బలు తగిలించుకున్నప్పటికీ, ఇంట్లో వస్తువులు చెల్లాచెదురు చేసినా.. తిట్టడం, కొట్టడం, పెద్దగా అరవటం ఏమాత్రం మంచిదికాదు. కళ్లు ఎరుపుచేసి గద్దించడం మంచిది కాదు. ఈ విధంగా ప్రతి ఒక్క చేష్టకూ అడ్డు తగిలితే వారిలో ప్రతీదీ తెలుసుకోవాలనే జిజ్ఞాస అణగారిపోతుంది. పిల్లల ఉత్సాహాన్ని ప్రోత్సహించడమే మంచిది. పసి మనస్తత్వం ఎలా ఉంటుందంటే.. తల్లిదండ్రులతో మమతానుబంధాలు దృఢంగా కలిగివున్న చిన్నారులు పెద్దయిన తరువాత ఆత్మవిశ్వాసం కలిగి మంచి పౌరులుగా మెలుగుతారంటూ ఏమాత్రం విస్మరించలేని అంశాన్ని తెలియజెప్పారు రచయిత. ప్రస్తుత కాలంలో పిల్లలకు - ప్రేమమూర్తులు, మేకవనె్న పులుల-ను విడదీసి పరిశీలించే శక్తియుక్తులు నేర్పాలంటూ గ్రంథాన్ని చాలా అర్థవంతంగా ముగించారు రచయిత. అయితే మొత్తమీద చెప్పిన విషయాలే కొన్నిచోట్ల మళ్లీ చెప్పినట్టు ఉంది. ఉదాహరణకు పిల్లలు పక్క తపడటం, గురక, 52వ పేజీ అనుబంధ ఆహారం అధ్యాయంలో చాక్లెట్లు తినడం గురించి చెప్పిన విషయాలు. గ్రంథం చిన్న అక్షరాల ప్రింట్‌తో చదవడానికి కొంత ఇబ్బందిగా అనిపించింది.

-జోస్యుల మల్లేశ్వరి