రాష్ట్రీయం

చింటూ లొంగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింటూ లొంగుబాటు
వారం రోజుల పోలీసు కస్టడీ
మేయర్ దంపతుల హత్య కేసు
చిత్తూరు, నవంబర్ 30: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు నగర మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్‌ల హత్యకు సంబంధించి ప్రధాన నిందితుడు పి శ్రీరామ చంద్రశేఖర్ అలియాస్ చింటూ (43) 14 రోజుల తరువాత ఎట్టకేలకు చిత్తూరు కోర్టులో లొంగిపోయాడు. ఈసందర్భంగా ఆయనకు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. కేసు విచారణ దశలో ఉండటం, చింటూ ప్రధాన నిందితుడు కావడంతో 7రోజులు పోలీస్ కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. ఎవరూ ఊహించని విధంగా చింటూ సోమవారం ఉదయం 11.45 గంటలకు 4వ అదనపున్యాయమూర్తి ముందు లొంగిపోయాడు. గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈనెల 17న మేయర్ దంపతులను హత్య చేసింది కూడా ఉదయం 11.45 గంటలు ప్రాంతంలోనే. కాగా చింటూ కోర్టుకు వచ్చిన సమయంలో నింపాదిగా కారులో దిగి ఎలాంటి బెరుకులేకుండా కోర్టులో ప్రవేశించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. న్యాయమూర్తి రిమాండ్ విధించిన తరువాత చింటూను బందోబస్తునడుమ ప్రత్యేక వాహనంలో కడప జైలుకు తరలించారు.
కాగా ఈకేసులో చింటూ లొంగుబాటుతో తొమ్మిది మంది నిందితులు పోలీసుల కస్టడీకి చేరినట్లయ్యింది. తప్పించుకు తిరుగుతున్న మరో ఇద్దరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా చింటూ కోర్టులో లొంగిపోయాడని తెలియగానే కటారి మోహన్ అనుచరులు పెద్ద ఎత్తున కోర్టు వద్దకు చేరుకుని ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. చింటూ తరపున ఎవరూ వాదించవద్దంటూ నినాదాలు చేశారు. చింటూ కోర్టులో లొంగిపోయాడని తెలుసుకున్న మరుక్షణం జిల్లా ఎస్పీ శ్రీనివాస్ కోర్టు ముందు పెద్ద ఎత్తున సాయుధ పోలీసులను మోహరింపజేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకున్నారు. చింటూకు న్యాయమూర్తి రిమాండ్‌ను విధించిన వెంటనే పోలీసులు సినీ ఫక్కీలో ఆయన్ను మీడియాకంట పడకుండా కడప జైలుకు తరలించారు. అనంతరం చింటూను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం చిత్తూరుకి తరలించారు. మొత్తం మీద రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసును చేధించడంలో జిల్లాస్థాయి పోలీస్ అధికారి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు చేసిన కృషి అజ్ఞాతంలో ఉన్న చింటూను లొంగుబాటు దిశగా నడిపించడంలో సత్పలితాలను సాధించారనే చెప్పాలి. (చిత్రం) సోమవారం చిత్తూరు కోర్టులో లొంగిపోయిన చింటూ