ఆటాపోటీ

చిరిబొగా లొంగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్రమాలు, అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈక్వెడార్ ఫుట్‌బాల్ సమాఖ్య చీఫ్ లూయిస్ చిరిబొగా స్థానిక కోర్టులో లొంగిపోయాడు. దక్షిణ అమెరికా కానె్ఫడరేషన్ కార్యవర్గ సభ్యుడిగా కూడా వ్యవహరిస్తున్న అతని పేరు అమెరికా తాజాగా ప్రకటించిన నిందితుల జాబితాలో ఉంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) అధ్యక్షుడు సెప్ బ్లాటర్‌సహా పలువురు ఉన్నతాధికారులు లంచాలు తీసుకొని రష్యా, కతార్ దేశాలకు ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీల నిర్వహణ బాధ్యతలను అప్పగించారన్న ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ తన పదవికి రాజీనామా చేశాడు. అమెరికా నుంచి కూడా ఫిఫాలోని కీలక వ్యక్తులు ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. దీనితో అమెరికా నిఘా విభాగం విచారణ మొదలుపెట్టింది. ఈ విభాగం సూచనలతో జ్యూరిచ్ అధికారులు ఈ ఏడాది మే మాసంలో 11 మందిని అరెస్టు చేశారు. కాగా, తాజాగా 16 మంది పేర్లను అమెరికా ప్రకటించింది. వారిలో చిరిబొగా కూడా ఉన్నాడు. న్యాయమూర్తి ఎదుట లొంగిపోవడానికి ముందు అతను విలేఖరులతో మాట్లాడుతూ ఈడ్వెడార్ ఎన్నడూ అవినీతిని ప్రోత్సహించలేదని, తాను ఎలాంటి పొరపాటు చేయలేదని చెప్పాడు.