ప్రేమలోకం.. ఇదుగో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశోక్ చంద్ర, రాజా సూర్యవంశీ, తేజారెడ్డి, కారుణ్య ప్రధాన తారాగణంగా శ్రీనివాసా ఫిలింస్ పతాకంపై టి.కరణ్‌రాజ్ దర్శకత్వంలో ఎస్.పి.నాయుడు రూపొందిస్తున్న చిత్రం ‘ఇదో ప్రేమలోకం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. దర్శకుడు కరణ్‌రాజ్ మాట్లాడుతూ- ప్రియుడికి ఇచ్చిన మాట కోసం తనవాళ్ళను వదులుకొని అతన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళే ఓ సాహస యువతి కథనంతో అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్నారు. ఓ ప్రత్యేక పాత్రల్లో నటించిన సుమన్, నరేష్‌లు ఆకట్టుకుంటారని, కోదాడ, మట్టపల్లి, వేదాద్రి వంటి ప్రాంతాల్లో షూటింగ్ చేసి అరకులోని అద్భుతమైన లొకేషన్లలో రెండు పాటల చిత్రీకరణ జరిపామని నిర్మాత ఎస్.పి.నాయుడు తెలిపారు. త్వరలోనే ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామన్నారు.