త్వరలో సెట్స్‌పైకి చిరు 150వ సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత కొన్ని రోజులుగా ప్రముఖ నటుడు చిరంజీవి 150వ చిత్రం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్‌న్యూస్ అందే సమయం దగ్గరలో వుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ రూపొందే 150వ సినిమాకు సన్నాహాలు జోరందుకున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. విజయ్ హీరోగా నటించిన తమిళ సూపర్‌హిట్ చిత్రం ‘కత్తి’ చిత్రానికి రీమేక్‌గా రూపొందే ఈ సినిమాకు కొన్ని మార్పులు చేసి తెరకెక్కిస్తారు. జనవరి మూడవ వారంలో షూటింగ్ ప్రారంభించి ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని తెలిసింది. ఈ చిత్రాన్ని మెగా తనయుడు రామ్‌చరణ్ నిర్మిస్తున్నాడు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడి కానున్నాయి.