చిత్తూరు

శ్రీవారి ప్రసాదం పేరిట నకిలీ జిలేబీలు విక్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, మార్చి17: శ్రీవారి ప్రసాదం పేరిట నకిలీ జిలేబీలు తయారు చేసి విక్రయిస్తున్న కాంట్రాక్టు పోటు కార్మికుడిని తిరుమల ఒన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమల ఒన్ టౌన్ సిఐ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీవారి అలయంలో కాంట్రాక్టు పద్ధతిలో పోటులో పనిచేసే సి వెంకటరమణ తిరుచానూరులోని వసంతరావునగర్‌లో నివాసం ఉంటున్నాడు. తన స్వగృహంలో గత అరు నెలలు నకిలీ జిలేబీలను తయారు చేసిన స్వామివారి ప్రసాదంగా భక్తులకు విక్రయించేవాడు. గురువారం తిరుమల అస్థాన మండపం వద్ద ఉన్న ఉద్యానవనంలో శ్రీవారి ప్రసాదం పేరుతో జిలేబీలను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్సై తిమ్మయ్య, భాస్కర్ అక్కడి చేరకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తన స్వగృహంలోనే జిలేబిలను తయారు చేసినట్లు చెప్పడంతో వారు తనిఖీలు చేశారు. ఈ సోదాలలో దాదా 21 జిలేబిలు, తయారీ సామగ్రిని సీజ్ చేశామని సిఐ విజయ్‌శేఖర్ తెలిపారు. శ్రీవారి ప్రసాదంగా ఒక్కొక్క జిలేబీని 500 రూపాయలకు విక్రయించినట్ల విచారణలో తేలిందన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.