లెక్క తప్పకుండా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లెక్కల మాస్టారు సుకుమార్ ప్రస్తుతం రంగస్థలం విజయంతో జోరుమీదున్నాడు. ఏకంగా 200 కోట్ల వసూళ్లతో టాలీవుడ్‌లో టాప్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ సినిమా తరువాత ఆయన మహేష్‌బాబుతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. మైత్రీ మూవీస్ నిర్మించే ఈ చిత్రం కోసం స్క్రిప్ట్‌వర్క్‌లో బిజీగా వున్నాడు సుకుమార్. ప్రస్తుతం భరత్ అను నేను సక్సెస్ తరువాత మహేష్ నటిస్తున్న 25వ చిత్రం జూన్ మొదటివారంలో రెగ్యులర్ షూటింగ్ అమెరికాలో ప్రారంభం కానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా తరువాత మహేష్ త్వరలోనే సుకుమార్ సినిమా మొదలుపెట్టాలని భావిస్తున్నాడట. ఇదివరకే సుకుమార్‌తో మహేష్ చేసిన 1 నేనొక్కడినే సినిమా భారీ అంచనాలమధ్య విడుదలై పరాజయాన్ని అందుకుంది. అయినా సరే సినిమాకు ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో ఈసారి వీరి కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రం మంచి విజయం అందుకునేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఈసారి ఆయన సైకలాజికల్ థ్రిల్లర్ లేదా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట. ఏదేమైనా ఈ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా లెక్క తప్పేలా ఉండకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.