పాటలో ‘లవ్‌స్టోరీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమికుల దినోత్సవం స్పెషల్‌గా ‘లవ్‌స్టోరీ’ నుంచి ఓ అప్‌డేట్ రానుందట. నాగచైతన్య, సాయిపల్లవి జోడీగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న చిత్రం -లవ్‌స్టోరీ. రొమాంటిక్ లవ్‌ను సున్నితంగా చెప్పగలిగే శేఖర్ నుంచి వస్తోన్న ప్రాజెక్టు కావడంతో -యూత్‌లో మంచి ఎక్స్‌పెక్టేషనే్స ఉన్నాయి. పైగా చైతూ మంచి కథలతో సెటిల్డ్ ట్రాక్‌లో నడుస్తుండటం, సాయిపల్లవి పెర్ఫార్మెన్స్.. వెరసి ప్రాజెక్టుపై ఇండస్ట్రీలోనూ ఆసక్తి కనిపిస్తోంది. అయితే, ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ‘ఏయ్ పిల్లా’ అన్న పాటను విడుదల చేస్తున్నట్టు అధికారికంగా చిత్రబృందం ప్రకటించింది. వరుణ్‌తేజ్ -సాయిపల్లవితో మంచి కథ చెప్పి ఆడియన్స్‌ని ‘్ఫదా’ చేసిన శేఖర్ -ఈ ప్రాజెక్టుపైనా తనదైన ప్రత్యేకత చూపిస్తున్నాడన్న సమాచారం ఉంది. ఫిదాలో భానుమతి తన తెలంగాణ యాసతో ఆసక్తి రేకెత్తిస్తే.. ‘లవ్‌స్టోరీ’ ప్రాజెక్టులో అదే ప్రయత్నాన్ని చైతూ చేస్తున్నాడన్న సమాచారం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ నిర్మిస్తోన్న సినిమా వేసవిలో థియేటర్లకు వచ్చే అవకాశముంది.