25న వస్తున్న ..ప్రేమించడమెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాంకర్ ప్రదీప్, అమృత అయ్యర్ జోడీగా మున్నా దర్శకత్వంలో యస్‌వి బాబు నిర్మించిన చిత్రం -ముఫ్పై రోజుల్లో ప్రేమించడమెలా? మార్చి 25న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో చిత్రబృందం మీడియా మీట్ నిర్వహించింది. కార్యక్రమంలో దర్శకుడు మున్నా మాట్లాడుతూ -2020లో ఆడియన్స్‌కి గుర్తుండిపోయే సినిమా ఇది. కథను అల్లు అర్జున్, బన్నీవాస్‌కి వినిపించినపుడు ఎంజాయ్ చేస్తూనే కొన్ని సజెషన్స్ ఇచ్చారు. అవి చాలా ప్లస్సయ్యాయి. సెన్సార్ టీం సినిమాను అప్రీషియేట్ చేయడం హ్యాపీగావుంది. సినిమా నచ్చటంతో బన్నీవాస్ జీఏ2 ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలోని కొన్ని ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్‌ని వెంటాడటం ఖాయం అన్నారు. నిర్మాత యస్‌వి బాబు మాట్లాడుతూ -నీలి నీలి పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అనూప్ వండర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. సినిమా హిట్టుపై నమ్మకంతో ఉన్నాం అన్నారు. హీరోయిన్ అమృత అయ్యర్ మాట్లాడుతూ -తొలి చిత్రంలోనే మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు మున్నాకి థాంక్స్. తెలుగులో నా ఫేవరేట్ హీరో అల్లు అర్జున్. వాళ్ల సంస్థ నుంచే సినిమా విడుదలవుతుండటం చాలా ఆనందంగా ఉంది అన్నారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ -దర్శకుడు మంచి సిట్యుయేషన్స్ క్రియేట్ చేయటంతో మంచి పాటలు కుదిరాయి అన్నారు. హీరో ప్రదీప్ మాట్లాడుతూ -మహేష్, రాణా, కాజల్, తమన్నాలాంటి స్టార్లు మా సినిమాను సపోర్ట్ చేయడం హ్యాపీగా ఉంది. మంచి కథను అద్భుతమైన లొకేషన్స్‌లో దర్శకుడు మున్నా తెరకెక్కించాడు. టీం ఎంతో కష్టపడి చేసిన సినిమా హిట్టవుతుందన్న నమ్మకముంది అన్నాడు.