వైవిధ్యంగా మధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థర్డ్ ఐ ప్రొడక్షన్స్‌పై రాహుల్, త్రిష్ణా ముఖర్జీ జోడీగా దర్శకురాలు శ్రీవిద్య తెరకెక్కించిన సైకలాజికల్ థ్రిల్లర్ -మధ. నిర్మాత ఇందిరా బసవ నిర్మించిన చిత్రం 13న విడుదలవుతోన్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై -వైవిధ్యమైన కథ, కథనాలతో వస్తోన్న మధను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. దర్శకురాలు శ్రీవిద్య మాట్లాడుతూ -కథ రాయాలంటే చాలా టైం పడుతుంది. రాసిన కథను సినిమా చేయడానికి కొంత ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. బట్, తీసిన సినిమాను రిలీజ్ చేయడం మామూలు విషయం కాదు. అందుకు సహకరిస్తున్న దర్శకుడు హరీశ్ శంకర్, నటుడు నవదీప్, నిర్మాత మహేశ్ కోనేరుకు థాంక్స్. ఓ మంచి సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు సహకరిస్తున్న లక్ష్మీ మంచు, నాగ్‌అశ్విన్, చాందిని చౌదరికి కృతజ్ఞతలు అన్నారు. ఓ మంచి సినిమాను ఆదరించాలని డీవోపీ అభిరాజ్, సంగీత దర్శకుడు నరేశ్ కుమరన్, చాందిని చౌదరి, హీరో రాహుల్, అనీష్, త్రిష్ణా ముఖర్జీ, లక్ష్మీ మంచు, నవదీప్, హరీశ్ శంకర్ తదితరులు కోరారు.