8న కోనాపురంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనూషా సినిమా పతాకంపై కె.బి.కృష్ణ దర్శకత్వంలో అనిల్ మొగిలి, రేయాన్ రాహుల్, సునీత ప్రధాన తారాగణంగా రూపొందించిన చిత్రం కోనాపురంలో జరిగిన కథ. ఈ నెల 8న అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. నిర్మాతలు మచ్చ వెంకటరెడ్డి, బట్టు అంజిరెడ్డి, పల్లె వినయ్‌కుమార్ సినిమాకు సంబంధించిన పాత్రికేయుల సమావేశం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతలు దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్ అతిథులుగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- సినిమా పేరులో వున్నట్లుగా కోనాపురంలో జరిగే కథ కాదని, రెండు గ్రామాలమధ్య గొడవల నేపథ్యంలో మిస్టరీ మర్డర్‌గా సినిమా వుంటుందని అన్నారు. కథలో ఎవరు ఎవరిని టార్గెట్ చేసి హత్యచేస్తున్నారు అనేది ఆసక్తికరంగా, ఉత్కంఠంగా ఉండేలా స్క్రిప్ట్ రాసుకున్నామని, అదేవిధంగా సినిమాకూడా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని ఆయన అన్నారు. వాస్తవికంగా వుండే సినిమాలంటే తనకిష్టమని, అలాంటి కథలతోనే చిత్రాలు చేయడానికి పరిశ్రమకు వచ్చానని నిర్మాత వెంకట్‌రెడ్డి తెలిపారు. నాలుగేళ్ల కలగా ఈ చిత్రాన్ని తాము రూపొందించామని, ప్రశాంతంగా వున్న రెండు పల్లెలు ఓ అనూహ్య సంఘటనతో ఎలా ఉలిక్కిపడ్డాయి? ఆ సంఘటనల వెనుక ఎవరున్నారు అనే అంశాన్ని దర్శకుడు ఉత్కంఠంగా తెరకెక్కించారని, అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటుగా సందేశం కూడా చిత్రంలో వుంటుందని మరో నిర్మాత పల్లె వినయ్‌కుమార్ అన్నారు.